TS Elections 2023: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవని విమర్శించారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
నందిపేట్ మండలంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల గురించి ఆలోచించవని విమర్శించారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్ముదామా లేదా కొత్త కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నదని, 10 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదని, పెన్షన్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో ఆ రాష్ట్రంలో 9 గంటలు వస్తున్న కరెంటును 5 గంటలకు పరిమితి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మరొకసారి మోసపోదామా లేదా మంచి పనులు చేస్తున్న కారు గుర్తుకు ఓటేద్దామా అన్నది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌ది 42 పేజీల మానిఫెస్టో కాదు.. 420 మేనిఫెస్టో అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తోందని.. ఎలాగూ గెలిచేది లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నామని.. అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. 420 మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రజల ముందుకు తెచ్చిందని.. జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తమని మేనిఫెస్టోలో పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్నదా..? అని నిలదీశారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం తాము అమలు చేస్తున్నవేనని అన్నారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి