Govardhan Puja 2023: గోవర్ధన పూజ ఎప్పుడు?, ఈ పూజా ప్రత్యేకత ఏమిటి, పూజా ప్రత్యేక సమయాలు..

Govardhan Puja 2023: హిందూ సాంప్రదాయంలో గోవర్ధన పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం అమావాస్య తిథిలో మార్పుల కారణంగా పండగ తేదీల్లో మార్పులు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2023, 02:49 PM IST
Govardhan Puja 2023: గోవర్ధన పూజ ఎప్పుడు?, ఈ పూజా ప్రత్యేకత ఏమిటి, పూజా ప్రత్యేక సమయాలు..

 

Govardhan Puja 2023: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీన గోవర్ధన పూజ పండుగను జరుపుకుంటారు. పండగను ప్రతి సంవత్సరం దీపావళి తర్వాతి రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ గోవర్ధన పూజ పండగను భారత దేశవ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఈ పండగ రోజున శ్రీకృష్ణుడితో పాటు ఆవులను పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ ఏడాది అమావాస్య తిథి రెండు రోజులు రావడంతో గోవర్ధన పూజ తేదీపై సందేహం నెలకొంది. గోవర్ధన పూజ పై జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ఏంటో? ఏ రోజు ఈ పండగను జరుపుకోవాలో, గోవర్ధన పూజ విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గోవర్ధన్ పూజ పండగ ఎప్పుడంటే:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కార్తీక శుక్ల పక్షం ప్రతిపద తిథి నవంబర్ 13, సోమవారం మధ్యాహ్నం 02:56 గంటలకు ప్రారంభమై..నవంబర్ 14 మంగళవారం మధ్యాహ్నం 02:36 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ తిథి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం గోవర్ధన పూజను నవంబర్ 14వ తేదీన జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

గోవర్ధన పూజ శుభ సమయం:
గోవర్ధన పూజా పండగ శుభ సమయం ఉదయం 6: 42 నిమిషాల నుంచి 8:51 నిమిషాల వరకు ఉంటుంది. శుభ సమయం మొత్తం వ్యవధి రెండు గంటల 9 నిమిషాల పాటు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూజా కార్యక్రమాలు చేయాలనుకునేవారు ఇదే సమయంలో చేయడం చాలా శుభప్రదమని వారు చెబుతున్నారు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

గోవర్ధన పూజ రోజు ప్రత్యేక యోగం:
ఈ సంవత్సరం గోవర్ధన పూజలో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 01:57 వరకు శోభన యోగా ఏర్పడుతోంది. అంతేకాకుండా ఇదే సమయంలో మరో ప్రత్యేక యోగం కూడా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడడం కారణంగా గోవర్ధన పూజ పండగకు మరింత ప్రాముఖ్యత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎవరైనా కొత్త పనులు ప్రారంభించుకోవాలనుకునే వారు కూడా ప్రారంభించుకోవచ్చు.

గోవర్ధన పూజ విధానం:
గోవర్ధన పూజను చేయాలనుకునేవారు ఉదయాన్నే బ్రహ్మ గడియల్లో నిద్ర లేవల్సి ఉంటుంది. 
తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని..ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి. 
ఆ తర్వాత ఇంట్లో ఉండే చిన్న గుడిని శుభ్రం చేసుకుని పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. 
పూజ గదిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి అభిషేకాలు చేసి పువ్వులతో అలంకరించాలి.
ఇలా అలంకరించిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన 108 రకాల వంటకాలను సమర్పించాలి.
ఆ తరువాత శ్రీకృష్ణుని ధ్యానిస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఉపవాసాలు ప్రారంభించాల్సి ఉంటుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News