Vemulawada BJP Ticket Issue: వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన తుల ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని ఆమె హెచ్చరించారు. తనను మోసం చేయడానికి వారికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని.. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీలో సిద్ధాంతాలు లేవని.. బీసీ సీఎం అనేది బూటకమని ఆరోపించారు. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆమె స్థానంలో వికాస్ రావుకు బీజేపీ టికెట్ ఇవ్వడంతో తుల ఉమ పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తనకు బీజేపీ చేసిన అన్యాయం గురించి చెప్పుకొచ్చిన తుల ఉమ.. వెక్కి వెక్కి ఏడ్చారు. బీజేపీలో బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని.. బండి సంజయ్ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో మహిళలకు స్థానం లేదని.. నమ్మించి మోసం చేశారని ఫైర్ అయ్యారు. తనకు బీజేపీ నాయకులు ఎవరైనా ఫోన్ చేస్తే.. చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీకి సిద్ధాంతాలు లేవన్నారు. బీసీలను బొందపెట్టి.. అగ్రవర్ణాలకు పెద్ద పీట వేస్తున్నారని తేలిపోయిందన్నారు. బీజేపీ బీసీ నినాదం ఎటు పోయిందని ప్రశ్నించారు. చెబుతున్న మాటలకు.. చేస్తున్న చేతలకు పొంతనలేదన్నారు.
పార్టీలో చేరిన రెండు మూడు నెలల్లోనే వికాస్ రావుకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు తుల ఉమ. ఆసుపత్రి డబ్బులు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా.. సేవ అంటే ఎలా నిలదీశారు. సేవ అనే ముసుగులో అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే అధికారం కోసం చూస్తున్నారని విమర్శించారు. బీజేపీలో థర్డ్ క్లాస్ నాయకులు ఉన్నారని.. పార్టీ కోసం వాళ్లు ఏ మాత్రం పని చేయడం లేదన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది వచ్చారని.. తనకు బీఫామ్ ఇవ్వకపోవడంతో వాళ్లంతా ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళుతున్నానని.. కాంగ్రెస్‌లోకి వెళుతున్నానని కొంత దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను పార్టీ మార్పు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని.. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన వద్దకు ఎవరైనా బీజేపీ నాయకులు వస్తే చెప్పుతో కొడతానని స్పష్టం చేశారు. ఎవరినీ తన వద్దకు అడుగు కూడా పెట్టనివ్వనని అన్నారు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook