పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గింపు; నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి..

పెట్రోల్ ధరలు తగ్గింపు; నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి..

Last Updated : Sep 17, 2018, 04:27 PM IST
పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గింపు; నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. పెట్రో ధరల నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రెండు రూపాయలను తగ్గించింది. 'నేడు, పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రెండు రూపాయలు తగ్గించేందుకు సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది' ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కలబురగిలో తెలిపారు.

‘రోజూ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రజలు పెట్రో ధరలు తగ్గితే బాగుండని అనుకుంటున్నారు. మా సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై  రెండు రూపాయలు తగ్గించాలని నిర్ణయించింది. మా ప్రభుత్వ నిర్ణయం, కర్నాటక ప్రజలకు ఊరటనిస్తుందని భావిస్తున్నాం’ అని కుమారస్వామి కలబురగిలో తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇంధన ధరలను లీటరుకు రెండు రూపాయలు తగ్గించాయి.

అటు సోమవారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.06, కోల్‌కతాలో రూ.83.91, ముంబైలో రూ.89.44, చెన్నైలో రూ.85.31గా ఉంది. డీజిల్‌ ధర కూడా న్యూఢిల్లీలో లీటరు రూ.73.78, కోల్‌కతాలో రూ.75.63, ముంబైలో రూ.78.33, చెన్నైలో రూ.78గా నమోదైంది.

కాగా ప్రస్తుతం బెంగళూరులో పెట్రోల్ రూ.84.74గా, డీజిల్ రూ.76.16గా ఉన్నాయి.   

 

Trending News