Delhi Pollution: కాలుష్యం తగ్గించేందుకు కొత్త ప్రయోగం, కృత్రిమ వర్షాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన

Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2023, 11:23 AM IST
Delhi Pollution: కాలుష్యం తగ్గించేందుకు కొత్త ప్రయోగం, కృత్రిమ వర్షాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఢిల్లీ కాలుష్యాన్ని చాలానే కారణాలున్నాయి. కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలేవీ సత్ఫలితాలనివ్వడం లేదు. 

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కల్గిస్తోంది. ప్రతి యేటా శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీకు కాలుష్యం బెడద వెంటాడుతుంటుంది. ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలైనా హర్యానా, పంజాబ్, యూపీల్లో లక్షలాది ఎకరాల్లోని పంట వ్యర్ధాల్ని సరిగ్గా ఇదే సమయంలో తగలబెడుతుంటారు. పంట వ్యర్ధాల్ని తొలగించే క్రమంలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు రైతులు అవలంభించే ఈ ప్రమాదకర అలవాటు ఢిల్లీ ప్రజలకు శాపంగా మారుతోంది. పంట వ్యర్ధాల్నించి వెలువడే విషపూరిత పదార్ధాలతో కూడిన పొగంతా ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తుంటుంది. దీనికి వాహన కాలుష్యం, పొగమంచు తోడవుతుంటుంది. పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుంది. గాలి నాణ్యత పెంచేందుకు, కాలుష్యం నియంత్రించేందుకు తక్షణ ఉపాయం ఆలోచించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. 

ఇప్పటికే ఢిల్లీలో గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షలు అమలవుతున్నాయి. సీఎన్జీ యేతర భారీ ట్రక్కులకు వాహనాలకు ఢిల్లీలో అనుమతి లేదు. మరోవైపు వింటర్ బ్రేక్ హాలిడేస్ ముందే ఇచ్చేశారు. విద్యా సంస్థలకు నవంబర్ 18 వరకూ సెలవులిచ్చారు. 

ఇప్పుడు కాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం కోసం కృత్రిమ వర్షాలు కురిపించే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్తరి గోపాల్ రాయ్, ఆర్ధిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యం నియంత్రించేందుకు కృత్రిమ వర్షాల ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాలని ఐఐటీ కాన్పూర్ ను ప్రభుత్వం కోరింది. కృత్రిమ వర్షాలు కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు ఆవహించి ఉండాలి. ఈ నెల 20-21 తేదీల్లో మేఘాలు ఆవహించే అవకాశమున్నందున ఆ సమయంలో కృత్రిమ వర్షాలకు మేఘ మథనం చేసేందుకు సిద్ధమౌతున్నారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన ప్రణాళికను సమర్పించనున్నారు. 

సాధారణంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవు పరిస్థితుల్ని తగ్గించేందుకు, అడవుల్లో రాజుకునే మంటల్ని అదుపు చేసేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు కృత్రిమ వర్షాలు ఓ ప్రత్యామ్నాయం కాగలవు. మేఘాల్ని కరిగించే సిల్వర్ అయోడిన్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాల్ని ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా మేఘాల్లో చల్లుతారు. ఇవి మేఘాల్ని కరిగించి వర్షాలు కురిసేలా చేస్తాయి.

Also read: Mahua Moitra Case: మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫారసు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News