Gold Price Today: బంగారం కొనుగోలు చేస్తున్నారా..? ఈ విషయాలు కచ్చితంగా గుర్తు పెట్టుకోండి

How To Identify Pure Gold: థంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనేముందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు మైండ్‌లో ఉంచుకుని నగల దుకాణానికి వెళ్లండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 11:04 PM IST
Gold Price Today: బంగారం కొనుగోలు చేస్తున్నారా..? ఈ విషయాలు కచ్చితంగా గుర్తు పెట్టుకోండి

How To Identify Pure Gold: మన దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధంతేరస్ రోజున బంగారం కొనుగోలు ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారం ధరలు ఇటీవల ఓ రేంజ్‌లో పెరిగాయి. ధరలు పెరుగుతున్నా గోల్డ్‌కు ఉన్న క్రేజ్‌ మాత్రం ఎప్పుడూ తగ్గదు. అయితే బంగారం కొనే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తెలుసుకోకుండా బంగారం కొంటే మోసం పోయే అవకాశం ఉంది. మార్కెట్‌లో డూప్లికేట్‌లు, మెటల్‌తో మిక్స్ చేసిన బంగారాన్ని అమ్ముతున్నారు. చూసేందుకు అచ్చం బంగారంలానే ఉంటుంది. బంగారం అని కొనేసి ఇంటికి వెళ్లి ఎప్పుడో చెక్ చేసుకుంటే.. లాభం ఉండదు. అందుకే డూప్లికేట్ మెటల్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. బంగారంలో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 

బంగారం కొనే ముందు స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛమైనది. ప్రతి క్యారెట్ బంగారం 4.2 శాతం స్వచ్ఛమైన బంగారంతో సమానం. మేకింగ్ ఛార్జీల గురంచి కూడా ముందే తెలుసుకోవాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం చేస్తారు. ప్రతి బంగారు ఆభరణానికి మేకింగ్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుత బంగారం ధరలలో ప్రతిబింబిస్తాయి.

మిషన్‌తో తయారు చేసిన ఆభరణాలు, మనుషులు డిజైన్ చేసిన బంగారు ఆభరణాల ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. మిషన్‌తో తయారు చేసిన ఆభరణాలు తక్కువ ధరకు ఉంటాయి. బంగారు ఆభరణాలను తూకంలో విక్రయిస్తారు. ముక్క ఎంత బరువైతే అంత ఖర్చవుతుంది. బంగారం కొనుగోళ్లు పెరగడంతో.. వాటి ధరలు స్థిరంగా పెరుగుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు.. ఆఫర్‌లు ఉన్నప్పుడు ఆఫ్-సీజన్‌లో బంగారం కొనడం మంచిది. 

Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది

Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News