Rashmika Viral Video: సోషల్ మీడియా ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రమాదకరంగా కూడా కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులోనూ సెలబ్రెటీస్ ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు, అలానే వాళ్ళ ఫేక్ వాయిస్ ఆడియో క్లిప్పులు, తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది అది నిజమే అనుకోని అసలు పైన కోపం పెంచుకుంటున్నారు.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన దగ్గరనుంచి సెలెబ్రిటీల ఫోటోలు ఏఐ టెక్నాలజీతో ఇష్టమొచ్చినట్టుగా మార్చుతున్నారు. అసలు ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా పోతోంది.
తాజాగా రష్మిక మందన్న విషయంలో కూడా ఇదే జరిగి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ హీరోయిన్ మార్పింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ కాసాగింది. ఈ వీడియోలో రష్మిక ఫారిన్ స్లాంగ్ మాట్లాడటం, కాస్త బోల్డ్‌గా కనిపించడంతో ఈ వీడియో నెట్లో ప్రత్యక్షమైన కాసేపటికే వైరల్ అయింది. కానీ ఆ వీడియో చూసిన వారికి చాలా మటుకు అది ఫేక్ వీడియో అని అర్థమవుతుంది. ఇక ఈ వీడియో మీద చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో పైన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా రియాక్ట్ అవ్వడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.
బ్రిటిష్ ఇండియన్ అమ్మాయి అయిన జారా పటేల్ వీడియోను కొంతమంది రష్మిక మందాన మొహం పెట్టి మార్పు చేసి దాన్ని సోషల్ మీడియాలో వేసేశారు. కాగా ఇలాంటివి పోను పోను చాలా ప్రమాదకరంగా మారవచ్చని తప్పకుండా వీటిపైన యక్షన్ తీసుకోవాలని
ఆ వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ వేశారు అమితాబ్.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
ఇలాంటి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమితాబ్ అన్నడంతో ఆ పోస్టు కింద చాలామంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. రష్మిక మందన మాత్రమే కాకుండా ఇలాంటి ఫేక్ ఏఐ వీడియోలు సెలెబ్రిటీల పాలిట శాపంగా మారుతుంది. ఈ వీడియోల ద్వారా సెలబ్రెటీస్ కి చెడ్డపేరు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు సెలబ్రిటీస్ విషయంలోనే ఇలా జరిగితే ఇక మామూలు అమ్మాయిల విషయంలో కూడా ఇలాంటివి జరిగి అవి లేనిపోని వాటికి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి నిజంగానే బిగ్ బి చెప్పినట్టు వీటి పైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం.
Also read: Chandrababu Bail Conditions: చంద్రబాబు బెయిల్‌కు అదనపు షరతులు వర్తిస్తాయి
Also read: Delhi Air Pollution: వాయు కాలుష్యం అంతకుమించి.. ఈ నెల 10వ తేదీ వరకు స్కూల్స్‌కు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link- https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link- https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి