Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇప్పుడు సత్వర చర్యలు అమలుకానున్నాయి. వాయు కాలుష్యం తీవ్రత పెరిగేకొద్దీ దశలవారీగా కఠిన నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ అమల్లోకి వచ్చేసింది.
ఢిల్లీ ప్రమాదంలో పడింది. వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. గాలిలో విష వాయువుల గాఢత 2.5 శాతానికి చేరుకోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ప్రమాణాల కంటే ఇది 80 శాతం ఎక్కువ. ఫలితంగా ఢిల్లీలో శ్వాసకోశ, కంటి దురద, చర్మ వ్యాధులకు గురయ్యే ప్రమాదం కన్పిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిని అతి తీవ్ర కాలుష్యపు జోన్‌గా ప్రకటించారు. ఇదే పరిస్థితి మరో రెండ్రోజులు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల్ని తగలబెట్టడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700కు చేరుకుంటే మరి కొన్ని ప్రాంతాల్లో 618, ఇంకొన్ని ప్రాంతాల్లో 589 గా నమోదవుతోంది. సరాసరిన ఢిల్లీ ఏక్యూఐ 589గా అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగే కొద్దీ నిబంధనలు, ఆంక్షలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో స్కూళ్లకు నవంబర్ 10 వరకూ సెలవులు ప్రకటించారు.
ఢిల్లీలో అమల్లోకి గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షలు, ఆ ఆంక్షలు ఏంటి
మరోవైపు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP స్టేజ్ 4 అమల్లోకి వచ్చిందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమీషన్ ప్రకటించింది. ఈ దశలో ఇతర రాష్ట్రాల్నించి సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 6 వాహనాల్ని మాత్రమే ఢిల్లీలో ప్రవేశించేందుకు అనుమతిస్తారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో అమల్లో ఉన్న స్జేజ్ 1, 2, 3 ఆంక్షలకు ఇది అదనం.
డీజిల్‌తో నడిచే మధ్య, బారీ తరహా వాహనాలకు అనుమతి లేదు. నిర్మాణ, కూల్చివేత పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలి. ముఖ్యంగా హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్స్మిషన్, పైప్లైన్ల నిర్మాణం ఆపేయాలి. 6 నుంచి 9వ తరగతి, 11 వ తరగతి విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. పబ్లిక్, మున్సిపల్, ప్రైవేట్ ఆఫీసుల్లో 50 శాతం మందితో పనులు కొనసాగించాలి. మిగిలినవాళ్లు వర్క్ ఫ్రం హోం చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలి.
Also read: Delhi Air Pollution: వాయు కాలుష్యం అంతకుమించి.. ఈ నెల 10వ తేదీ వరకు స్కూల్స్‌కు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook