Earthquake In Nepal: నేపాల్‌లో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 6.4 భూకంప తీవ్రతతో నమోదైంది. ఈ ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఏం జరుగుతోందనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భోజనం చేసి నిద్రించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భూమి కంపించింది. సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎ) భూకంపం గురించి సమాచారం అందించింది. శుక్రవారం రాత్రి 11:32 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉందని వెల్లడించింది. ఇది 28.84 N అక్షాంశం, 82.19 E రేఖాంశంలో సంభవించింది.
Earthquake of Magnitude:6.4, Occurred on 03-11-2023, 23:32:54 IST, Lat: 28.84 & Long: 82.19, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/SSou5Hs0eO@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju @PMOIndia pic.twitter.com/XBXjcT29WX
— National Center for Seismology (@NCS_Earthquake) November 3, 2023
ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు సంభవించిన కాసేపటికే ప్రజలు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోతోంది. "నేను టీవీ చూస్తున్నాను. అకస్మాత్తుగా కొద్దిగా తల తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పుడు నేను భూకంపం గురించి టీవీలో చూశాను. దీంతో నేను మా ఇంటి నుండి బయటకు వచ్చాను" అని నోయిడాకు చెందిన తుషార్ అనే వ్యక్తి తన అనుభవం గురించి చెప్పారు. కాగా.. నేపాల్‌లో బలమైన భూకంపాలు సంభవించడం నెల రోజుల్లో ఇది మూడోసారి.
Scenes after earthquake at Supertech Ecovillage 1 #भूकंप pic.twitter.com/5CaFH6tRWo
— Basudev Sahu (@Basudevsahu06) November 3, 2023
Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్ లుక్‌లో మెగా బ్రదర్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి