5 Days Working: ఉద్యోగులకు తీపి కబురు.. ఐదు రోజుల పని.. జీతాలు భారీగా పెంపు..!

IBA Agreed For 5 Days Banking: అన్నీ సవ్యంగా సాగితే.. బ్యాంక్‌ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురురానుంది. ఐదో రోజుల పనితోపాటు 15 శాతం జీతాల పెంపునుకు ఐబీఏ ప్రతిపాదనలు పంపించింది. వీటికి కేంద్రం, ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 02:14 PM IST
5 Days Working: ఉద్యోగులకు తీపి కబురు.. ఐదు రోజుల పని.. జీతాలు భారీగా పెంపు..!

IBA Agreed For 5 Days Banking: బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల త్వరలోనే నెరవేరే అవకాశం కనిపిస్తోంది. వారానికి ఐదు రోజుల పని నిబంధనలు అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రతిపాదించింది. ప్రభుత్వరంగ, ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఉద్యోగుల జీతాలను 15 శాతం పెంచేందుకు చర్చలు జరిపింది. కాగా.. ఐదు రోజుల పని వారానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఐబీఏ ఆమోదించింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం బ్యాంకు శాఖలు నెలలో మొదటి, మూడో, ఐదో శనివారాలు పనిచేస్తుండగా.. రెండు, నాల్గో శనివారాలు సెలవులు ఇస్తున్నాయి. 2015లో 10వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ ప్రకారం.. ఆర్‌బీఐ, ప్రభుత్వం.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో ఏకీభవించాయి. అప్పటి నుంచి రెండు, నాల్గో శనివారాలను సెలవులుగా అమలవుతున్నాయి. అయితే అన్ని శని, ఆదివారాల్లో తమకు సెలవు ఇవ్వాలని అప్పటి నుంచే బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.  ఈ ప్రతిపాదనకు కేంద్రం, ఆర్‌బీఐ ఆమోదం తెలిపితే..  బ్రాంచ్‌లలో రోజువారీ పని గంటలను 45 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. 

అదేవిధంగా ఈ వారం ప్రారంభంలో.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ జీతాలలో 15 శాతం పెంచాలని కోరింది. అయితే బ్యాంక్ యూనియన్లు ఇతర డిమాండ్లతో పాటు మరిన్ని కోరుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు అధిక వేతనాల పెంపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో పీఎన్‌బీ 10 శాతం పెంపునకు బదులుగా 15 శాతం జీతాలు పెంచేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవలి సంవత్సరాలలో లాభాలు బాగా పెరిగిన నేపథ్యంలో జీతాలు గణనీయంగా పెంచాలని స్టాఫ్, వర్కర్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో నిర్వీరామంగా పని చేశామని.. ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకురావడమే కాకుండా.. రుణదాతలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి తాము చాలా ప్రయత్నాలు చేశామని అంటున్నాయి. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల తరుణంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశతో ఉన్నారు. ఈ తరుణంలోనే ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలోపు ఉద్యోగుల జీతాల పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో మూడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత 2020లో చివరిసారిగా బ్యాంక్ ఉద్యోగుల జీతాన్ని పెంచిన విషయం తెలిసిందే.

Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వం బంపర్ బహుమతి.. 7వ వేతన సంఘం అమలుపై కీలక ప్రకటన  

Also Read: Samsung Galaxy F34 5G Price: రేపటికే లాస్ట్..SAMSUNG Galaxy F34 5G మొబైల్ పై రూ. 15,400 వరకు తగ్గింపు..  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News