Kupwara Encounter: భారత భూభాగంలోకి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సరిహద్దులో కాపలా ఉన్న భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకుంటున్నారు. అలాంటి మరో ప్రయత్నంలో భద్రతా దళాలు సక్సెస్ సాధించారు.
భారత పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా సెక్టార్లో ఇవాళ ఐదుగురు ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు చెందినవారుగా భద్రతా బలగాలు గుర్తించాయి. మరోవైపు ఎల్వోసీ వెంబటి ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీస్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ కిలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ కార్యాలయంలో జమ్ము కశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థలతో నిన్న జరిగిన సమావేశంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కూలంకషంగా చర్చ జరిగింది. స్థానికంగా ఉన్న యువత ఉగ్రవాదంలో వెళ్లడం తగ్గడంతో విదేశీ ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఏడాదిలో జమ్ము కశ్మీర్ ప్రాంతంలో వివిద ఎన్కౌంటర్లలో 46 మంది ఉగ్రవాదులు హతం కాగా ఇందులో 37 మంది విదేశీయులే ఉన్నారు. 9 మంది మాత్రమే స్థానికులున్నారు. ఇంకా కశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో 130 మంది ఉగ్రవాదులు ఉండగా అందులో సగం మంది పాకిస్తాన్‌కు చెందినవారుగా హోం మంత్రిత్వ శాఖ చెబుతోంది.
Also read: ED Raids: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్, ముఖ్యమంత్రి కుమారుడికి ఈడీ నోటీసులు, విస్తృత సోదాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook