Nandamuri vs Nara: చంద్రబాబు అరెస్ట్ అనంతరం హడావిడి చేసిన బాలయ్య ఒక్కసారిగా కనుమరుగై పోయారు. పవన్ కళ్యాణా్‌తో కలిసి బావను జైళ్లో పరామర్శించాక తిరిగి ఆయన ఊసే లేకుండా పోయింది. ఓదార్చేందుకు వస్తున్నానన్న బాలయ్య స్థానంలో భువనేశ్వరి ఆ పర్యటన చేయనుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తరువాత బాలయ్య మీడియా సమావేశం పెట్టి ఆర్భాటపు ప్రకటనలు చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి జైళ్లో బావను కలిశారు. ప్రజల కోసం తాను వస్తున్నానని స్పష్టం చేశారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, నేనున్నానని అభయమిచ్చారు. తెలుగువాడి సత్తా చూపిద్దామని పిలుపునివ్వడమే కాకుండా...చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక మరణించిన కుటుంబాలకు అండగా ఉంటానని..త్వరలో ఆ కుటుంబాల్ని పరామర్శిస్తానని హామీ ఇచ్చారు.
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలవరం రేపాయనే వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రకటన తరువాత తిరిగి బాలయ్య హడావిడి కన్పించలేదు. ఎక్కడా జాడ లేదు. జైలు వ్యవహారం, కోర్టు వ్యవహారం, పార్టీ వ్యవహారాలన్నీ చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేశ్ మాత్రమే చూస్తున్నారు.
మరోవైపు బాలయ్య చేస్తానని చెప్పిన ఓదార్పు యాత్రను భువనేశ్వరి కొనసాగించనుండటం పార్టీలో జరిగిన కీలక పరిణామంగా భావించాలి. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాల్ని నేరుగా భువనేశ్వరి పరామర్శించనున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంటే ఓదార్పుయాత్ర నుంచి బాలయ్యను తప్పించినట్టే అర్ధమౌతుంది. ఓదార్పుయాత్రను బాలయ్య చేపడితే పార్టీలో పట్టు కోల్పోతుందని నారా కుటుంబం భావించిందా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకే ఓదార్పు యాత్రను నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబ వ్యక్తే చేపట్టేట్టు నిర్ణయం మారిందని తెలుస్తోంది.
Also read: Balakrishna: బావ కోసమా..ఆ స్థానం కోసమా, బాలకృష్ణ ఓదార్పు యాత్ర ప్రకటన మర్మమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook