Chandrababu Custody: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌పై ఉన్న చంద్రబాబుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన గంటలో..మరో దెబ్బ తగిలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరోసారి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటీషన్ కొట్టివేసిన తరువాత ఏసీబీ కోర్టు సీఐడీ కస్టడీ పిటీషన్‌పై తీర్పు ఇచ్చింది. సీఐడీకు రెండ్రోజులపాటు కస్టడీకు అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే సీఐడీ కస్డడీని జైలులో తీసుకుంటారా లేదా బయటెక్కడైనా విచారిస్తారా అనేది సీఐడీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దీనికి సమాధానంగా జైలులోనే చంద్రబాబును విచారిస్తామని సీఐడీ స్పష్టం చేసింది. దాంతో జైలులో చంద్రబాబును రెండ్రోజులపాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
వాస్తవానికి సీఐడీ కస్టడీ విషయంలో ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయి నిన్ననే తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే క్వాష్ పిటీషన్ పై ఏపీ హైకోర్టులో తీర్పు వెలువడాల్సి ఉండటంతో హైకోర్టు తీర్పు వచ్చేవరకూ నిరీక్షిద్దామని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఏపీ హైకోర్టు ఇవాళ మద్యాహ్నం 1.30 గంటలకు క్వాష్ పిటీషన కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దాంతో ముందుగా చెప్పినట్టే మద్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండ్రోజుల కస్టడీకు అప్పగించింది.
సీఐడీ అధికారుల నిర్ణయం మేరకు చంద్రబాబును రెండ్రోజులు జైలులోనే విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. రేపు, ఎల్లుండ రెండ్రోజులు సీఐడీ విచారణ జరపనుంది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ 140 మందిని విచారించింది. కీలకమైన సాక్ష్యాలు సేకరించింది. ఇప్పుడు చంద్రబాబును స్వయంగా విచారించి ఆయన పాత్రపై మరి కొన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించనుంది. ఉదయం 9.30 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే చంద్రబాబుని విచారించాలని, ఇద్దరు న్యాయవాదులు సమీపంలో ఉండేందుకు అనుమతిస్తున్నామని ఏసీబీ న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Also read; Ap High Court: చంద్రబాబుకు షాక్, క్వాష్ పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu Custody: చంద్రబాబుకు మరో దెబ్బ, రెండ్రోజులు సీఐడీ కస్టడీకు చంద్రబాబు