Healthy Breakfast Ideas: మనం తినే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అనే మాట అక్షర సత్యం. ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని కూడా అందుకే చెబుతుంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు.. ఎలాంటి లైఫ్ స్టైల్‌ని అలవర్చుకున్నారు అనే దానిని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
ఇటీవల కాలంలో జనం ఎక్కువగా అనారోగ్యం సమస్యల బారిన పడటానికి ఎక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తినడం ఒక కారణమైతే.. ఒకే చోట కదలకుండా కూర్చుని చేస్తోన్న డెస్క్ జాబ్స్ ఆరోగ్యం దెబ్బతినడానికి మరో కారణం అవుతున్నాయి. అందుకే ఏం తింటున్నామో.. ఎంత తింటున్నామో.. మనం తినే తిండి వల్ల ఎంత లాభం ఉంది అనేది తెలుసుకుని తినాలి. అప్పుడే అనారోగ్యం బారినపడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతాం.
ఆహారం తీసుకునే విషయంలో ప్రతి మనిషి జీవితం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తోనే మొదలవుతుంది కనుక అక్కడి నుండే తగిన జాగ్రత్త వహించడం అనేది అవసరం. అందుకే మీకు తక్కువ కేలరీలు ఉండే బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్‌పై ఇవాళ ఓ స్మాల్ లుక్కేద్దాం.
అడై దోశ :
అడై దోశలో 68 కేలరీలు ఉంటాయి. కొద్ది మోతాదులో బియ్యం, అధిక మోతాదులో పప్పు ధాన్యాలు నానబెట్టి, పులిగిన పిండితో చేసిన ఈ దోశల్లో కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది.
శనగల పిండితో చేసిన దోశ :
శనగల పిండితో చేసిన దోశలో 337 కేలరీలు ఉంటాయి. ఐతే ఇందులో ప్రొటీన్ కూడా అంతే అధికంగా ఉంటుంది కనుక ఇది మరింత హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అవుతుంది.
దాల్ పరాటా :
దాల్ పరాటాలో 151 కేలరీలు ఉంటాయి. పైగా ఇది ఇంట్లో చేసుకోవడం ఈజీ కూడా అవుతుంది.
దలియా కిచిడి :
దలియా కిచిడి అంటే గోధుమ రవ్వతో చేసిన కిచిడి. ఇందులో 123 కేలరీలు ఉంటాయి. గోధుమ రవ్వతో కిచిడి చేసుకోవడం కూడా ఈజీనే.
ఎగ్ బుజియా :
ఎగ్ బుజియా అంటే మరేంటో కాదు.. మనం ఇంట్లో అన్నం తినేందుకు వండుకునే ఎగ్ కర్రీనే. ఈ ఎగ్ బుజియాలో 123 కేలరీలు ఉంటాయి. ఉల్లిపాయ, టమాట తరిగి ఎగ్ బుజియా తయారు చేస్తే ఆ టేస్టే వేరు.
ఈజీ ఇడ్లీ :
ఇడ్లీలలో 110 కేలరీలు ఉంటాయి. ఇడ్లీలు జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా పోషక విలువలు కూడా ఉంటాయి. పైగా ప్రతీ ఇంట్లో ఇడ్లీ మేకింగ్ కూడా ఈజీ. అంతేకాకుండా ఒకేసారికి నలుగురుకి సరిపడా బ్రేక్ ఫాస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు.
కినోవా ఓట్ దోశ :
కినోవా ఓట్ దోశలో 103 కేలరీలు ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ దోశకు పులగ పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఈ బ్రేక్ ఫాస్టును తక్కువ సమయలోనే ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు.
రాగి రవ్వ ఇడ్లీలు :
రాగులను రవ్వగా పట్టించి, వాటితో ఇడ్లీలు చేసుకుని తింటే అంతంటే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మరొకటి ఉండదు. రాగి రవ్వతో చేసిన ఇడ్లీలు మృదువుగా రావడమే కాకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచిగా ఉంటాయి.
ఇది కూడా చదవండి : Reduce High Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను వెన్నలా కరిగించే అద్భుత ఇంటి చిట్కాలు..
సాబుదానా కిచిడి :
సాబుదానాతో చేసిన కిచిడిలో 141 కేలరీలు ఉంటాయి. ఇండియాలో ఇదొక పాపులర్ ఫుడ్. సాబుదానా ఎంత హెల్తీ అంటే.. ఎవరైనా ఏదైనా జబ్బుల బారినపడినప్పుడు సాబుదానాతో చేసిన జావా పెట్టడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఇది ఈజీగా జీర్ణం అవ్వడంతో పాటు అనారోగ్యం నుంచి త్వరగా బయటపడే శక్తిని అందిస్తుంది.
ఇది కూడా చదవండి : శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? ఈ డ్రింక్స్ తాగండి.. కొన్ని రోజుల్లోనే ఫలితం పొందుతారు!
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Healthy Breakfast Ideas: తక్కువ సమయంలో చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు