Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్

Nipah Virus Cases In Kerala: కేరళలో తాజాగా మరో నిపా వైరస్ మరణాలు సంభవించాయి. ఇప్పటికే ఇద్దరు మరణించగా.. ఇప్పుడు మరో ఇద్దరు మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. మరొకరికి పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 14, 2023, 08:58 AM IST
Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్

Nipah Virus Cases In Kerala: కేరళను నిపా వైరస్ భయపెడుతోంది. నాలుగేళ్ల తరువాత ఈ వైరస్ తిరిగి రావడంతో పెరుగుతున్న ఆందోళనలు పెరిగాయి. కోజికోడ్ జిల్లాలో ఇద్దరు నిపా వైరస్ కారణంగా మరణించినట్లు కేరళ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిన అరికట్టేందుకు చర్యలను పటిష్టం చేసింది. తాజాగా రెండు మరణాలతోపాటు మరో కేసును కూడా కేరళ ప్రభుత్వం నివేదించింది. నిపా వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం 19 కమిటీలను ఏర్పాటు చేసింది. కోజికోడ్‌లో బుధవారం మరో నిపా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో ఇన్‌ఫెక్షన్ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. మరణాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటికే ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు నమూనాలను నిపా పాజిటివ్ పరీక్షించినట్లు వెల్లడించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. 789 మంది కాంటాక్ట్‌లలో 77 హై-రిస్క్ కేటగిరీలో ఉన్నాయన్నారు. 153 మంది తక్కువ రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు చెప్పారు. నిపా వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 19 కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.

"మేము టెలిమెడిసిన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. నిపా వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడానికి  19 కమిటీలను నియమించాం. హై-రిస్క్ కేటగిరీలో ఉన్న ఏ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు లేవు. మరణించిన వారి రూట్ మ్యాప్‌లు గుర్తించాం. హై-రిస్క్ కేటగిరీలో ఉన్న రోగులు వారి సంబంధిత ఇళ్లలోనే ఉండాలని సూచించాం. వారికి ఏవైనా లక్షణాలు ఉంటే.. వారు కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి ఏదైనా లక్షణాలను నివేదించినట్లయితే.. వారిని మెడికల్ కాలేజీకి తరలిస్తాం.." అని వీణా జార్జ్ తెలిపారు. మెడికల్ కాలేజీలో ఐసోలేషన్ కోసం 75 గదులు ఉన్నాయన్నారు. 

కాంటాక్ట్ లిస్టులో ఉన్న 13 మందిని మెడికల్ కాలేజీలో చేర్పిస్తున్నామని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి జార్జ్ తెలిపారు. ఐసోలేషన్‌లో ఉన్నవారు వాలంటీర్ల సపోర్ట్‌ను తీసుకోవచ్చని చెప్పారు. వాలంటీర్లను పంచాయతీల ద్వారా నియమించినట్లు పేర్కొన్నారు. ఐసోలేషన్ కోసం ఆసుపత్రులలో మరిన్ని గదులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ వరకు అవసరమైతే జిల్లా కలెక్టర్ కోజికోడ్ జిల్లాలో సభలను నిషేధించవచ్చన్నారు. ఆగస్టు 20న నిపా కారణంగా మరణించిన వ్యక్తి ఇండెక్స్ కేసు అని మంత్రి తెలిపారు. హెల్త్ డైరెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించామని.. రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశం నిర్వహించిందని తెలిపారు. 

Also Read: Numerology Number Predictions Today: ఈ నంబరు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.. మీ దశ తిరిగినట్లే..!  

Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News