Anurag Thakur on Ujjwala Scheme: గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు మూడేళ్లలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రూ.7,210 కోట్ల విలువైన ఈ-కోర్టుల మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 3కి కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆన్లైన్, పేపర్‌లెస్ కోర్టులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీంతో న్యాయ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుందని చెప్పారు.
పేపర్ లెస్ ప్రచారం గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కోర్టులు, ఈ-ఫైలింగ్, ఈ-చెల్లింపు వ్యవస్థను ప్రజలకు పరిచయం చేస్తామని తెలిపారు. డేటాను స్టోర్ చేయడానికి క్లౌడ్ స్టోరేజ్‌ను రూపొందిస్తామన్నారు. అన్ని కోర్టు సముదాయాల్లో 4,400 ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మరింత మంది మహిళలకు చేరువ చేయనున్నారు. మహిళలకు 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వ పెట్రోలియం కంపెనీలకు 1,650 కోట్ల రూపాయలను విడుదల చేసే ప్రతిపాదనను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది. ఇందుకోసం మొత్తం రూ.1,650 కోట్లు ఖర్చు చేయగా.. ఆ భారాన్ని మొత్తం కేంద్రమే భరించనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలకు విడుదల చేయనుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను మే 2016లో ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది. తాజాగా మొదటి రీఫిల్, స్టవ్ కూడా ఉచితంగా అందించనుంది. ఈ పథకం కింద రూ.200 సబ్సిడీతో ఏడాదికి 12 సిలిండర్లు అందజేస్తోంది. కాగా.. రక్షాబంధన్ సందర్భంగా గ్యాస్ ధరలను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.
Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు
Also Read: Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి