Heavy Rains Alert: వాతావరణంలో బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ద్రోణి వాయువ్య మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాంద్ర మీదుగా పశ్చిమ బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.
పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి సముద్రమట్టంపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. అదే సమయంలో నైరుతి పవనాల గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా వీస్తుండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలకు, ఏపీలో సాధారణ వర్షాలకు అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రానికి రానున్న 5 రోజులు భారీ వర్ష సూచన జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ వరకైతే సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకూ తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశముంది.
అయితే కోస్తాంధ్రలో కూడా ఈ నెల 14 వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ నెల 12 నాటికి అల్పపీడనంగా మారనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి నుంచి దక్షిణ తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
Also read: YS Sharmila: కేసీఆర్ పుట్టిందే ఇందుకోసమని గప్పాలు కొట్టారు.. చివరికి ఇలా: వైఎస్ షర్మిల సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook