Apple iPhone 15 Launch: Apple ఐఫోన్ 15 స్పెషల్.. ఫీచర్స్ ఏంటి? ధర ఎంతంటే..?

ఆపిల్ ఐ ఫోన్ 15 ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'వండర్‌లస్ట్' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో కొత్త మోడల్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆపిల్ ఐ ఫోన్ 15 సీరీస్ గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 05:41 PM IST
Apple iPhone 15 Launch: Apple ఐఫోన్ 15 స్పెషల్.. ఫీచర్స్ ఏంటి? ధర ఎంతంటే..?

Apple iPhone 15 Launch: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ నుంచి మరో కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. ఈ నెల అనగా సెప్టెంబరు 12న 'వండర్‌లస్ట్' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో పలు కొత్త మోడల్స్ ను యాపిల్ సంస్థ లాంఛ్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి ఇప్పుటికే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ ఆల్ట్రా 2తో పాటు మరికొన్ని గాడ్జెట్స్ అందుబాటులోకి రానున్నాయని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీటితో పాటు USB - C పోర్టుతో ఎయిర్‌పోడ్స్ (2nd gen)ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో నిజనిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐఫోన్ 15 లాంఛ్ అప్పుడే..?
'వండర్‌లస్ట్' అనే ఈవెంట్ ను ఈ నెల అనగా సెప్టెంబరు 12 న నిర్వహించనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఇందులో కొత్త వాచ్ మోడల్స్ ను విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ను యూట్యూబ్ సహా ఇతర మాధ్యమాల ద్వారా ప్రత్యక్షప్రసారం చూడవచ్చు. 

ఐఫోన్ 15 ఎలా ఉండబోతుంది?
ఇదే కార్యక్రమంలో ఐఫోన్ 15 కూడా లాంఛ్ చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, ఈ మోడల్ ను మాత్రం టైటానియం ఫ్రేమ్ తో వస్తుందని వినికిడి. ఐఫోన్ 15 ప్రో మోడళ్లు సిల్వర్, బ్లాక్, బ్లూ కలర్ లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 

ఐఫోన్ 15 సిరీస్ లో 4 వేరియంట్స్..
iPhone 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వంటి నాలుగు వేరియంట్స్ ఉన్నాయి. 

USB-C పోర్ట్..
దాదాపుగా దశాబ్దం తర్వాత తమ లైటింగ్ పోర్ట్ ను మార్పు చేయబోతుంది యాపిల్ సంస్థ. USB - C తో ఐఫోన్ 15 సిరీస్ మార్కెట్లోకి విడుదల కాబోతుందని తెలుస్తోంది. 

స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ..
ఐఫోన్ 15 మోడల్ లోని అన్ని వేరియంట్స్ టైటానియంతో తయారు చేయనున్నారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 

యాపిల్ వాచ్ ఆల్ట్రాలో యాక్షన్ బటన్
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో మ్యూట్ స్విచ్ బదులు యాపిల్ వాచ్ ఆల్ట్రాలో యాక్షన్ బటన్ ఉండనుంది. సింగిల్ బటన్ ద్వారా ఎన్నో యాప్స్ ను కంట్రోల్ చేసుకునే సౌలభ్యం ఇందులో అందుబాటులోకి రానుంది. 

Also Read: Bharat vs India: దేశం పేరు మార్పుపై కేంద్రం వైఖరి ఇదే, జీ20 నేమ్‌ప్లేట్‌పై అదే

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
ఐఫోన్ 15 ప్రో మోడల్స్ లో ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే విధంగా తయారు చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ లో 35W వరకు వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చని తెలిసింది. 

కెమెరా అప్‌గ్రేడ్
ఐఫోన్ 15 మోడల్స్ లో ప్రో వేరియంట్స్ మాదిరిగా 48 MP ప్రైమరీ కెమెరా సెన్సార్ పొందవచ్చని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

iPhone 15 Pro Maxలో పెరిస్కోప్ లెన్స్
చాలా ఏళ్ల తర్వాత iPhone మోడల్స్ లో పెరిస్కోప్ కెమెరా అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో 3x టెలిఫొటో లెన్స్ వినియోగానికి రానుందని సమాచారం.  

4 రకాల కలర్ వేరియంట్స్
ఐఫోన్ 15 ప్రో మోడల్స్ లో టైటాన్ గ్రే, నీలం, వెండి (సిల్వర్) స్పేస్ బ్లాక్ (నలుపు)తో సహా మరో రెండు కొత్త రంగులతో మొబైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రో మోడల్స్ లో మొదటిసారిగా ఐఫోన్ గోల్డ్ షేడ్ రాకపోవచ్చు. 

ఐఫోన్ 15 మోడల్ ధరల పెంపు
అమెరికాలో లాంఛ్ చేయనున్న ఐఫోన్ 15 మోడల్ అంచనా ధరలు బయటకు వచ్చాయి. గతేడాది విడుదలైన మోడల్ తో పోలిస్తే ఈ సారి 100 డాలర్లు ఎక్కువగా అంటే రూ. 8 వేల కంటే ఎక్కువ ధర పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే ప్రో మాక్స్ మోడల్ పై 200 డాలర్లు అంటే రూ. 16 వేలకు ఎక్కువ ధర వెచ్చించి కొనాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తంగా ఐఫోన్ 15 ధర (అమెరికాలో) రూ. 92 వేల నుంచి రూ.1.08 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మాత్రం గతంలో మాదిరిగానే అదే ధరకు లభించే అవకాశం ఉంది.

Also Read: Chandrababu Arrest Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, కేసు పరిణామాలిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News