సూపర్‌స్టార్లందరూ.. ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి: కేరళ మంత్రి

ఇటీవల కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Sep 4, 2018, 12:25 PM IST
సూపర్‌స్టార్లందరూ.. ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి: కేరళ మంత్రి

ఇటీవల కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో పాటు వరదలు రావడంతో కేరళలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కేరళను విరాళాలు ఇచ్చారు.

అయితే మళయాళ నటులపై ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే అధికంగా విరాళాలు ఇచ్చారని కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ అన్నారు. కొందరు మళయాళ నటులెవరూ సాయం చేసేందుకు ముందుకురాకపోవడంపై మంత్రి సురేంద్రన్ ఈ మేరకు స్పందించినట్లు తెలిసింది.

సురేంద్రన్‌ మాట్లాడుతూ.. ‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. వారు ప్రతి సినిమాకు రూ.3-4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని విన్నాను. వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలి. ఆయన మలయాళ సినిమాల్లో నటించనప్పటికీ.. కష్టాల్లో ఉన్న కేరళను చూసి చలించిపోయి భారీగా (కోటి రూపాయలు) విరాళం ఇచ్చారు.’ అని అన్నారు.

కాగా  కేరళకు ఇప్పటి వ‌ర‌కూ వివిధ రూపాల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. సినీ, రాజ‌కీయ‌, క్రీడా, స్వచ్చంద సేవాసంస్థలు, ప్రముఖ కంపెనీలు, ప్రజ‌ల నుంచి విరాళాల రూపంలో అందాయి. సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. కమల్‌హాసన్‌, మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్‌ సల్మాన్‌, అల్లు అర్జున్‌, సిద్ధార్థ్‌, ధనుష్‌, రజనీకాంత్‌, శివకార్తికేయ, నయనతార, విశాల్‌, విక్రమ్‌,  నాగార్జున, విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ హీరోలు తదితరులు విరాళాలు ఇచ్చి కేర‌ళ‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు.

Trending News