"మిస్టర్ ఇండియా"పై అత్యాచారం కేసు

మిస్టర్ ఇండియా టైటిల్‌ను 8 సార్లు.. మిస్టర్ ఆసియా టైటిల్‌ను రెండు సార్లు అందుకున్న నేవీ అధికారి మురళీ కుమార్‌ను ప్రస్తుతం కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Last Updated : Sep 4, 2018, 12:18 AM IST
"మిస్టర్ ఇండియా"పై అత్యాచారం కేసు

మిస్టర్ ఇండియా టైటిల్‌ను 8 సార్లు.. మిస్టర్ ఆసియా టైటిల్‌ను రెండు సార్లు అందుకున్న నేవీ అధికారి మురళీ కుమార్‌ను ప్రస్తుతం కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ ఎస్సీ మహిళను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. ఆమెను శారీరకంగా లొంగదీసుకొని.. ఆ తర్వాత మొహం చాటేశాడని ఫిర్యాదు అందడంతో మురళీకుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలో నేవీ అధికారిగా పనిచేస్తున్న మురళీ కుమార్ గత కొన్ని నెలలుగా ఓ మహిళతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు.

తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమికులిద్దరూ అనేకసార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఆ మహిళను మురళీ కుమార్ శారీరకంగా వేధించాడని కూడా తెలుస్తోంది. ఇటీవలే బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు స్వీకరించిన కేరళ పోలీసులు ముంబయిలోని నేవీ అధికారులతో మాట్లాడి.. మురళీ కుమార్‌ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.

38 ఏళ్ల మురళీ కుమార్ ఇంటర్నేషనల్ బాడీబిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్ నిర్వహించిన 2018 పోటీల్లో కూడా ఓవరాల్ టైటిల్ గెలుచుకొని వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం పోలీసులు ఆయనను కొట్టాయంలోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. మురళీ కుమార్ చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Trending News