Minister Harish Rao: సీఎం పదవి కాదు.. సింగిల్ డిజిట్ తెచ్చుకోండి: అమిత్‌ షాకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao Counter to Amit Shah: ఖమ్మం సభలో అమిత్ షా చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. అబద్దపు విమర్శలు.. అవుట్ డేటేడ్ ఆరోపణలు చేశారని అన్నారు. రాబోయో ఎన్నికల్లో మీరందరూ మాజీలేనని జోస్యం చెప్పారు.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 27, 2023, 09:22 PM IST
Minister Harish Rao: సీఎం పదవి  కాదు.. సింగిల్ డిజిట్ తెచ్చుకోండి: అమిత్‌ షాకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao Counter to Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవి కాదని.. ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకోవాలని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తమకు నూకలు చెల్లడం కాదని.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని అన్నారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి.. ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 

కుటుంబ పాలన గురించి అమిత్ షా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. భారీఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచారని.. రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. 2జీ.. 3జీ.. 4జీ కాదని.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. 
రాబోయే ఎన్నికల్లో మీరందరూ మాజీలేనని అన్నారు. రాష్ట్రంలో సీఎం పదవి  కాదు.. ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. 

తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్ అని అన్నారు హరీశ్ రావు. అమిత్ షావి అబద్ధపు విమర్శలు.. అవుట్ డేటెడ్ ఆరోపణలు అని కొట్టిపారేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌తో హోం మంత్రి స్కిట్ చేశారని ఎద్దేవా చేశారు.

అంతకుముందు ఖమ్మం వేదికగా జరిగిన బీజేపీ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై అమిత్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని.. కేసీఆర్ ఓడుతున్నాడని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గుర్తుపెట్టుకోండి.. మీ పని అయిపోయిందంటూ కామెంట్స్ చేశారు. స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు.. మనకు అవసరం లేదన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు.

Also Read: Amit Shah: కేసీఆర్ నీ కొడుకు సీఎం అయ్యే ప్రసక్తే లేదు.. నిప్పులు చెరిగిన అమిత్‌ షా

Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News