Fire Accident In West Bengal Cracker Factory: పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో భవనం పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. బాధితుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బరాసత్ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ స్టేట్ యూనివర్శిటీకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ 24 పరగణాల దత్తపుకూర్‌లో ఈ ఫ్యాక్టరీ ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో బాణసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివసిస్తున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. భారీ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. బరాసత్లోని దత్తపుకూర్‌లోని ఇంట్లో అవసరమైన అనుమతులు లేకుండా క్రాకర్ల తయారీకి ముడి పదార్థాలను నిల్వ చేశారు. ప్రమాదానికి ఇవే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కాగా.. మే 16న తూర్పు మేదినీపూర్‌లోని ఖాదికుల్ గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే . ఆ తరువాత మే 21న ఉత్తర 24 పరగణాస్‌లోని బడ్జ్ బడ్జ్లోని అక్రమ బాణసంచా కర్మాగారంలో మరో పేలుడు సంభవించింది. వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
Also Read: Hyundai Creta: హ్యుండయ్ క్రెటాలో తక్కువ ధర మోడల్ ఇదే, ఫీచర్లు ఇలా ఉన్నాయి
Also Read: Surya Dev: ఆదివారం ఈ పరిహారంతో జీవితంలో అదృష్టం, డబ్బు, గౌరవాన్ని పొందండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook