Mizoram Railway Bridge Collapses: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఐజ్వాల్‌కు 21 కి.మీ దూరంలో సైరంగ్ ప్రాంతంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలి.. 17 మంది కూలీలు మృతి చెందారు. మరో 35 నుంచి 40 వరకు కార్మికులు గాయపడినట్లు పోటీసులు వెల్లడించారు. ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శిథిలాల నుంచి ఇప్పటివరకు 17 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా చాలా మంది తప్పిపోయారని పోలీసు అధికారి తెలిపారు. ఐజ్వాల్ వరకు రైల్వే కనెక్టివిటీని తీసుకురావడానికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. యంగ్ మిజో అసోసియేషన్ సైరంగ్ శాఖ ప్రస్తుతం రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
“కుప్పకూలిన వంతెన ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్ర రాజధానులను కలిపే భారతీయ రైల్వే ప్రాజెక్ట్‌లో భాగం. కొన్నేళ్లుగా ఇది నిర్మాణంలో ఉంది. ఈ సంఘటన ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఎంతమంది కూలీలు ఉన్నారనే విషయంపై క్లారిటీ రాలేదు” అని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డి తెలిపారు.
ఈ ఘటనపై మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా విచారం వ్యక్తం చేశారు. "ఐజ్వాల్ సమీపంలోని సైరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది. కనీసం 17 మంది కార్మికులు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ దుర్ఘటన తీవ్ర బాధను కలిగించింది. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.." అని ఆయన ట్వీట్ చేశారు.
Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి