Cheaper Home Loan: హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం చూస్తున్నారా..ఈ బ్యాంకు ట్రై చేయండి తక్కువ వడ్డీ ఇదే

Cheaper Home Loan: హోమ్ లోన్ ఇప్పుడు చౌకగా మారింది. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడమే కాకుండా ప్రోసెసింగ్ ఫీజు కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 13, 2023, 11:28 PM IST
Cheaper Home Loan: హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం చూస్తున్నారా..ఈ బ్యాంకు ట్రై చేయండి తక్కువ వడ్డీ ఇదే

Cheaper Home Loan: రెపో రేటు, రివర్స్ రెపో రేటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాలను బట్టి దేశంలోని వివిధ బ్యాంకులు వడ్డీ ఎంతనేది నిర్ణయిస్తుంటాయి. ముఖ్యంగా ఆర్బీఐ తీసుకునే రెపో రేటు ప్రభావం ఎక్కువగా హోమ్ లోన్ వడ్డీలపై పడుతుంటుంది. ఈ క్రమంలో అత్యంత తక్కువకు వడ్డీ ఇస్తున్న బ్యాంకు వివరాలు తెలుసుకుందాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రెపో రేటును యథాతధంగా ఉంచేందుకు నిర్ణయించడంతో కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. ఆగస్టు 14 నుంచి అంటే రేపట్నించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ రెపో రేటుపై తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటి రుణాలతో పాటు కారు రుణాల వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. దాంతో పాటు ప్రోసెసింగ్ ఫీజును కూడా తగ్గించేసింది. 

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్, కార్ లోన్ వడ్డీ రేట్లలో 20 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.50 శాతమైంది. ఇక కారు లోను వడ్డీ రేటు కూడా 20 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతమైంది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 14 నుంచి అమల్లోకి రానున్నాయి. 

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేట్లను తగ్గించడంతో కారు, హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. ప్రోసెసింగ్ ఫీజు కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ తక్కువ కావడంతో కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భావిస్తోంది. ఎందుకంటే వడ్డీ రేటు తగ్గడంతో ఈఎంఐ కూడా తగ్గిపోనుంది. వడ్డీ రేట్లను తగ్గించడానికి ముందే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉడాన్ పథకంలో భాగంగా ప్రోసెసింగ్ పీజును రద్దు చేసింది. ఎడ్యుకేషన్, గోల్డ్ లోన్ వంటి వాటికి ప్రోసెసింగ్ ఫీజును తొలగించేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ భేటీ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకూ జరిగింది ఈ భేటీ తరువాత ఆర్బీఐ రెపో రేటును యధాతధంగా ఉంచేందుకు నిర్ణయించింది. దాంతో వడ్డీ రేట్లలో ఏ విధమైన మార్పు రాదు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మారిస్తే బ్యాంకులు వడ్డీ రేట్లను మారుస్తుంటాయి.

Also read: Red Card System: క్రికెట్‌లో త్వరలో పుట్‌బాల్ తరహా రెడ్ కార్డ్, తొలిసారిగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News