Apple Cider Vinegar For Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్‌తో బరువు తగ్గడం ఎలాగో తెలుసా?

30 Day Apple Cider Vinegar Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్‌ని ప్రతి రోజు తీసుకోవడంత వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బాడీని రక్షిస్తుంది. కాబట్టి దీనిని ఇలా వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2023, 10:00 AM IST
Apple Cider Vinegar For Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్‌తో బరువు తగ్గడం ఎలాగో తెలుసా?

Apple Cider Vinegar For Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులై మధుమేహం, గుండె సమస్యలను ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం కారణంగా తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యాపిల్‌ సైడర్‌ వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించడమే కాకుండా తీవ్ర వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఇవే కాకుండా శరీరానికి మరెన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చర్మంపై అప్లై చేస్తే బోలెడు లాభాలు:
యాపిల్ సైడర్ వెనిగర్‌లో బోలెడు ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా  pH స్థాయిని నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని చర్మానికి వినియోగించడం వల్ల చర్మం మెరుగు పడుతుంది. అంతేకాకుండా తీవ్ర చర్మ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.

బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది:
మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని డయాబెటీస్‌ కారణంగా వచ్చే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది:

అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతున్నాయి. దీని కారణంగా గుండెపోటు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా యాపిల్‌ సైడర్ వెనిగర్‌ని వినియోగించాల్సి ఉంటుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
యాపిల్ వెనిగర్‌ని ప్రతి రోజు తాగడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా కేలరీల తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు యాపిల్ వెనిగర్‌ని ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News