Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..

Stuart Broad: ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఫీట్ ను సాధించి కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 10:52 AM IST
Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..

Stuart Broad Rare feat: ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్(Stuart Broad) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. యాషెస్‌ సిరీస్‌(Ashes Series)నే అతడికి చివరిది. కెరీర్ చివ‌రి మ్యాచ్‌లో ఇతడు ఎవరికీ సాధ్యంకాని రేర్ ఫీట్ ను సాధించాడు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాడ్‌ ఆసీస్‌ పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌(Mitchell Starc) బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. దీంతో కెరీర్‌లో ఎదుర్కొన్న‌ చివరి బంతికి సిక్సర్‌ కొట్టిన క్రికెట‌ర్‌గా బ్రాడ్ నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ సత్తాచాటిన బ్రాడ్ ఆఖరి బంతికి వికెట్ తీసి కెరీర్‌కు ఘనమైన ముగింపును పలికాడు. 

146 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో చివరి బంతికి సిక్సర్‌ బాదడంతో పాటు ఆఖరి బంతికి వికెట్‌ పడగొట్టిన తొలి ప్లేయర్‌గా బ్రాడ్‌ రికార్డు సృష్టించాడు. చివరి టెస్టులో ఇంగ్లిష్‌ జట్టు 49 పరుగులు తేడాతో విజయం సాధించి.. యాషెస్ సిరీస్‌ 2-2ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు 166 టెస్టులాడిన బ్రాడ్ 600 వికెట్లను తీశారు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అతడు నిలిచాడు. 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు తీశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌల‌ర్‌గా బ్రాడ్ గుర్తింపు పొందాడు.  2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇతడి బౌలింగ్ లోనే భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు.

Also read: India vs West Indies: చివరి వన్డేలో విండీస్ ఢమాల్.. వన్డే సిరీస్‌ టీమిండియాదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News