Giant Anaconda Snake Video: యూట్యూబ్ ఒక మహా సముద్రం... సముద్రానికైనా ఏదో ఒక చోట భూ భాగంతో సరిహద్దులు ఉంటాయి కానీ యూట్యూబ్ మాత్రం అలా కాదు.. యూట్యూబ్ ప్రపంచం అనంతం.. అదొక ఎల్లలు లేని లోకం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన యూట్యూబ్‌లో సముద్రంలో చేపల్లాగా నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఔరా అని అనిపించేలా ఉంటాయి. ఇంకొన్ని వైరల్ వీడియోలు మన కళ్లను మనమే నమ్మలేం అనిపించేలా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే.
Run Fun Tv అనే పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ యూజర్ పోస్ట్ చేసిన ఒక షార్ట్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో ఈ వీడియోకు 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 128 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతమంది ఎగబడి చూసేలా ఈ వీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా ? ఒక అసాధారణ సైజులో ఉన్న ఆనకొండ పాము పంట పొలాల్లోంచి బయటికొస్తూ అటుగా వెళ్లిన యువకుడిని వెంటాడుతుండటం ఆ వీడియోలో చూడవచ్చు. ఆనకొండను చూసిన భయంతో అతడు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పరుగెడుతుంటే.. ఆ ఆనకొండ కూడా అతడిని వెంబడిస్తూ వేగంగా పరిగెత్తుకొస్తున్నట్టుగా ఉంది.
ఈ వీడియోను చూసిన చాలా మంది ఇది నిజమే అనుకుని పొరపడుతూ మళ్లీ మళ్లూ చూడటమే కాకుండా వాట్సాప్ లో షేర్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇది ఒక గ్రాఫికల్ వీడియో. వీఎఫ్ఎక్స్ వర్క్ తెలిసి, క్రియేటివిటీ కట్టలుతెంచుకున్న ఔత్సాహికులు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
ఇది కూడా చదవండి : Rare White Snake Video: జనాన్ని భయంతో పరుగులు పెట్టించిన అరుదైన పాము
చూడ్డానికి అచ్చం నిజమైన సీన్ తరహాలోనే అవి ఉంటాయి. కానీ అవి జస్ట్ గ్రాఫిక్స్ మాత్రమే. ఆ వీడియోను నిశితంగా పరిశీలించి చూస్తే ఆ విషయం ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అన్నింటికి మించి ఈ సైజ్ ఆనకొండ పాములను హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాం కానీ రియల్ లైఫ్‌లో అవి లేవు. మన ఇండియాలో అసలే లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో ఫేక్ అనడానికి ఎన్నో ఆధారాలు ఉంటాయి. ఏదేమైనా ఇలాంటి వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో భారీగా ఆధరణ ఉంది. నెటిజెన్స్ ఇలాంటి వీడియోలను ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ వీడియోకు 128 మిలియన్ల వ్యూస్, 2 మిలియన్లకు పైగా లైక్స్ రావడమే అందుకు నిదర్శనం. అందుకే కంటెంట్ క్రియేటర్స్ సైతం ఇలాంటి వీడియోల వైపే మొగ్గు చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Wild King Cobra Snake: పంట పొలాల్లో 13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. అటవీ శాఖ సిబ్బందిని పరిగెత్తించిన పాము
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి