Jayasudha Meets Kishan Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో పార్టీలోకి చేరికలు జరగ్గా.. తాజాగా బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కీలక నేతలను బీజేపీలోకి రప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు బీజేపీలో చేరనున్నారని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కమలం గూటికి చేరనున్నారు. చేరికల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణలు ఢిల్లీకి వెళ్లారు. ఈటల రాజేందర్ కూడా హస్తినకు పయనమైనట్లు తెలుస్తోంది.
ఈ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డితో జయసుధ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఆ తరువాత 2016లో తెలుగు దేశం పార్టీలో చేరారు. 2019 వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2019లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గతేడాదే జయసుధ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా అడుగులేమి పడలేదు. తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ కిషన్ రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ స్థానం నుంచి జయసుధ పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని.. ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. బీజేపీ గూటికి జయసుధ చేరిక లాంఛనమే అంటున్నారు. కాగా.. ముషీరాబాద్ నుంచి బీజేపీ తరుఫున కె.లక్షణ్ బరిలో ఉంటున్నారు. ఎప్పటి నుంచో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. సీనియర్ నేతను కాదని జయసుధకు ఇక్కడ నుంచి టికెట్ కేటాయిస్తారా..? అనేది ప్రశ్నగా మారింది.
Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి