ఆసియా గేమ్స్ 2018: ఓడినా.. చరిత్ర సృష్టించిన పీవీ సింధు

ఇండోనేషియాలోని జకార్తా వేదికగా 10వ రోజు జరుగుతున్న ఆసియా క్రీడలు 2018లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత షూటర్ పివి సింధు వెండి పతకం సాధించింది.

Last Updated : Aug 28, 2018, 01:42 PM IST
ఆసియా గేమ్స్ 2018: ఓడినా.. చరిత్ర సృష్టించిన పీవీ సింధు

ఇండోనేషియాలోని జకార్తా వేదికగా 10వ రోజు జరుగుతున్న ఆసియా క్రీడలు 2018లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షూటర్ పివీ సింధు వెండి పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమిపాలై వెండి పతకం సాధించింది. ప్రత్యర్థికి చిక్కకుండా వ్యూహాత్మకంగా ఆడే తై 21-13, 21-16 వరుస సెట్ల తేడాతో సింధును ఓడించి బంగారు పతకం సాధించింది. మ్యాచ్ ఓడినా.. ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలిచింది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్‌లో తై జు యింగ్ చేతిలో సైనా నెహ్వాల్ ఓడిపోవడం..దాంతో సైనా కాంస్యంతో సరిపెట్టుకోవడం తెలిసిందే. 

 

మరోవైపు ఇవాళ జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ మరో రెండు రజత పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఆర్చరీ కాంపౌండ్‌ పురుషుల, మహిళల జట్టు విభాగంలో భారత్‌కు రజత పతకాలు వచ్చాయి. అటు సెమీఫైనల్లో కొరియా చేతిలో ఓడిపోయిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ బృందం కాంస్య పతకం సాధించింది.

 

 

 

Trending News