IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ యూట్యూబ్ నుంచి ఒక సాధారణ యూట్యూబర్ కోటి రూపాయలు సంపాదించాడు అని తెలిస్తే కచ్చితంగా ఆ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. దీనికే ఇలా అనుకుంటే.. అలా కోటి రూపాయలు సంపాదించిన యూట్యూబర్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐటి రైడ్స్ నిర్వహించారు అని చెబితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అవును తస్లిం అనే యూట్యూబర్ విషయంలో అదే జరిగింది.
ఎన్డీటీవీ వార్తా కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన తస్లిం యూట్యూబ్‌లో ట్రేడింగ్ హబ్ 3.0 అనే యూట్యూబ్ ఛానెల్లో స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన అప్‌డేట్స్, వగైరా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ కోటి రూపాయల వరకు డబ్బు సంపాదించాడు. అయితే, అతడు యూట్యూబ్‌ని అడ్డం పెట్టుకుని ఇతర మార్గాల్లోనూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు అతడి నివాసంపై ఐటి రైడ్స్ జరిపారు. ఐటి దాడుల్లో తస్లిం నివాసంలో రూ. 24 లక్షల క్యాష్ లభించింది.
ఇదిలావుంటే, తస్లిం అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదిస్తున్నట్టుగా వస్తోన్న ఆరోపణలను అతడి కుటుంబం ఖండించింది. యూట్యూబ్ ద్వారా తన సోదరుడు తస్లిం సంపాదించిన ప్రతీ పైసాకు ఇన్ కమ్ టాక్స్ చెల్లిస్తున్నాం అని తస్లిం సోదరుడు మీడియాకు తెలిపాడు. యూట్యూబ్ ద్వారా కోటి 20 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని.. దానిపై ఇప్పటికే 4 లక్షల రూపాయలు టాక్స్ కూడా చెల్లించాం అని తస్లిం సోదరుడు చెప్పుకొచ్చాడు.
తస్లిం ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాడా లేదా ? చెల్లిస్తే ఎంత చెల్లించాడు అనే వివరాలు పక్కనపెడితే.. ఈ ఘటనలో చాలామంది దృష్టిని ఆకర్షించిన అంశం ఏంటంటే.. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి.. వాటికి వ్యూస్ బాగా వస్తే.. ఒక సాధారణ వ్యక్తి రూ. 1 కోటికిపైగా సంపాదించేంత అవకాశం ఉంటుందా అనే ఊహే చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి 1కోటి సంపాదించిన యూట్యూబర్‌పై ఐడి రైడ్స్