How To File EPFO E Nomination: ఖాతాదారులకు ఆన్లైన్లో ఈ నామినేషన్ ఫైల్ చేసే సదుపాయం కల్పించింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ). ఈ-నామినేషనల్ ద్వారా ఈపీఎఫ్ అకౌంట్లకు తమ లబ్ధిదారుల పేర్లను ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఆన్లైన్లో ఈ నామినేషన్ ఎలా చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. మీ యూఏఎన్ నంబరు యాక్టివ్‌గా ఉంటే సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
ఇలా లాగిన్ అవ్వండి..
==> ఈ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లోకి వెళ్లండి.
==> యూఏఎన్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
==> మీరు పోర్టల్‌లో నమోదు చేసుకోకుంటే.. యాక్టివ్ యూఏఎన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. ఆ తరువాత లాగిన్ అవ్వండి
==> లాగిన్ అయిన తర్వాత పోర్టల్ ప్రధాన మెనులో "Manage" ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> డ్రాప్‌డౌన్ మెను నుంచి ఈ-నామినేషన్‌ను ఎంచుకోండి.
==> ఈ ఆప్షన్ మీ ప్రస్తుత వివరాలను చూసుకోవడానికి లేదా కొత్త వాటిని యాడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది
==> కొనసాగించడానికి “ఈ-నామినేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.
వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయండి ఇలా..
==> వ్యక్తిగత వివరాలను సమీక్షించండి. ఏమైనా మార్పులు ఉంటే అప్డేట్ చేయండి.
==> ఈ-నమోదు పేజీలో స్క్రీన్‌పై ఉన్న మీ వ్యక్తిగత వివరాలను సమీక్షించండి.
==> మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, ఇతర సంబంధిత సమాచారాన్ని నిర్ధారించుకోండి.
==> మీకు ఏమైనా మార్పులు చేయాలని అనుకుంటే.. మీ యజమాని లేదా ఈపీఎఫ్ఓ హెల్ప్‌డెస్క్‌ని సంప్రదించండి.
==> అన్ని వివరాలు సరిగా ఉంటే.. తదుపరి దశకు వెళ్లడానికి "అప్డేట్" బటన్‌పై క్లిక్ చేయండి.
నామినీ వివరాలను ఇలా నమోదు చేయండి
==> ఇక్కడ మీ నామినీ వివరాలను జోడించవచ్చు.
==> నామినీ పేరు, మీతో ఉన్న సంబంధం, పుట్టిన తేదీ, పర్సెంటేజ్ శాతాన్ని ఎంటర్ చేయండి.
==> మరో నామినీని యాడ్ చేయాలనుకుంటే.. "నామినీని జోడించు" బటన్‌పై క్లిక్ చేసి యాడ్ చేసుకోండి.
==> మీ నామినీ గురించి కచ్చితమైన వివరాలు ఉన్నాయని నిర్ధారించండి.
==> వివరాలను నమోదు చేసిన తర్వాత.. సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> నామినీకి సంబంధించిన అన్ని వివరాలను ఎంటర్ చేసిన తరువాత మరోసారి సమీక్షించండి.
==> సబ్మిట్ చేసే ముందు డేటా మొత్తం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
==> చివర్లో ఈ-నామినేషన్‌ను సేవ్ చేయడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
Also Read: Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది
Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి