Shocking Viral Video: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంటే కేవలం పాటలు, డ్యాన్స్ లేదా మీమ్స్ వంటి వైరల్ కంటెంట్ కోసం మాత్రమే కాదు... ఇంకెన్నో హ్యూమన్ ఇంట్రెస్ట్ వీడియోలు, వేధింపులు, దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి దాడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న డీటేల్స్ ప్రకారం చూస్తే.. రైలులో ఉన్న ఒక వ్యక్తి ఎదురుగా వస్తోన్న మరొక రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను బెల్ట్‌తో అతి దారుణంగా కొట్టడం చూడొచ్చు.
ఆ సమయంలో దాడికి పాల్పడుతున్న యువకుడు ప్రయాణిస్తోన్న రైలు కూడా రన్నింగ్‌లోనే ఉంది. యువకుడు బెల్టుతో కొడుతున్న తీరు చూస్తోంటే.. అవతలి రైలులో ఉన్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో అనేక సవాళ్లు లేవనెత్తింది. రైలు ప్రయాణికులపై ఆకతాయిలు దాడులకు పాల్పడుతుంటే ఇక రైలు ప్రయాణాలు ఎలా చేయడం అనే ఆందోళన రైలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. బీహార్‌లోని చాప్రాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
@I_DEV_1993 అనే ట్విటర్ యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు డోర్స్ వద్ద ఓపెన్ ఏరియాలో కూర్చున్న వారి భద్రతే కాకుండా రైల్లో కిటీకీలకు చేతులు ఆనించి కూర్చునే వారి పరిస్థితి ఏంటనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైలులో కిటీకీ వద్ద కూర్చున్న రైలు ప్రయాణికుల మెడలో చైన్స్ లాక్కెళ్లిన ఘటనలపై ఫిర్యాదులు ఉన్నాయి కానీ ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిపై దాడులకు సంబంధించిన ఘటనలు ఎప్పుడూ రిపోర్ట్ అవలేదు.
यह व्यक्ति दुसरे ट्रेन में दरवाजे के पास बैठे लोगों को बेल्ट से मार रहा है, क्या यह सही है 🤔
इस व्यक्ति के बेल्ट से मारने के कारण दरवाजे में बैठा व्यक्ति ट्रेन से गिर भी सकतें है,बड़ी दुर्घटना भी हो सकती है
कृपया ऐसे आसामाजिक आतंकी लोगों पर कड़ी कार्यवाही करें 🙏@RailMinIndia… pic.twitter.com/BQEgHWe9rO— देव 🚩 (@I_DEV_1993) July 7, 2023
చూడ్డానికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. రైలు ప్రయాణికులపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్న ఆకతాయి యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైలు ప్రయాణికులు, నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా ఇలాగే విడిచిపెడితే.. వీళ్ల పైశాచిక ఆనందం బారినపడే బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఖాయం అని నెటిజెన్స్ సైతం భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.