Indian Railways News: ఈ ప్రాంతంలోకి ట్రైన్ ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్‌గా లైట్స్‌ ఆఫ్.. ఎందుకంటే..?

Indian Railways Amazing Facts: తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో లోకల్ ట్రైన్లు ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా లైట్స్‌ మొత్తం ఆఫ్ అయిపోతాయి. మళ్లీ కొంతదూరం వెళ్లిన తరువాత మళ్లీ వాటంతటే అవే ఆన్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఆ ప్రాంతం ఎక్కడ ఉంది..?   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2023, 09:08 AM IST
Indian Railways News: ఈ ప్రాంతంలోకి ట్రైన్ ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్‌గా లైట్స్‌ ఆఫ్.. ఎందుకంటే..?

Indian Railways Amazing Facts: మన దేశంలో రైళ్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ మంది ట్రైన్‌నే ఎంపిక చేసుకుంటారు. ముందుగానే బెర్త్‌లు బుక్ చేసుకుని.. హ్యాపీ పడుకుని ప్రయాణించే సదుపాయం ఉండడంతో ట్రైన్ జర్నీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులోనే మొబైల్స్‌కు ఛార్జింగ్, ఫ్యాన్, లైట్స్ అన్ని సదుపాయలు కూడా ఉన్న విషయం తెలిసిందే. ట్రైన్‌లో ఎవరైనా సిబ్బంది ఆఫ్ చేస్తే తప్పా.. ఎప్పుడు కరెంట్ సమస్య ఉండదు. కానీ మన దేశంలో ఒక ప్రదేశంలో రైలు ఎంటర్ అవ్వగానే అన్ని లైట్లు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతాయి. అయితే అన్ని రైళ్లలో లైట్స్ ఆఫ్ అవ్వవు. కేవలం లోకల్ రైళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఎక్కడంటే..?

చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు దగ్గరలోని ప్రాంతం గుండా లోకల్ ట్రైన్లు వెళుతున్న సమయంలో ఆటోమేటిక్‌గా ట్రైన్‌లోని విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, ఇతర రైళ్లలో అలాంటి సమస్య లేదు. కేవలం లోకల్ రైళ్లలో మాత్రమే లైట్స్ ఆఫ్ అవుతాయి. ఈ విషయంపై ఓ లోకో పైలట్ మాట్లాడుతూ.. తాంబరం సమీపంలోని ఓ ప్రాంతం వద్ద ఓహెచ్‌ఈలో కరెంట్ సరఫరా ఉండదని తెలిపారు. అక్కడ పవర్‌ జోన్‌లు ఉన్నాయని.. ఒక పవర్ జోన్ నుంచి మరో పవర్ జోన్‌లోకి ప్రవేశించే సమయంలో టైన్ లైట్లు కొంత సమయం వరకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయని చెప్పారు. అంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసే పరికరాలు, ఓవర్ హెడ్ పరికరాలలో విద్యుత్ ఉండదన్నారు. 

అయితే లోకల్ రైళ్లలో మాత్రమే విద్యుత్ సరఫరా ఎందుకు ఆగిపోతుంది..? మిగిలిన ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఎందుకు ఆఫ్ అవ్వదు అని ప్రశ్నించగా.. లోకల్ రైలుకు విద్యుత్ సరఫరా డ్రైవర్ క్యాబిన్ నుంచి రావడమే ఇందుకు కారణమని వెల్లడించారు. డ్రైవర్ క్యాబిన్ పవర్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుందని.. ఇది OHE నుంచి పవర్‌ను తీసుకుంటుందన్నారు. 

ఇక్కడి నుంచే మొత్తం రైలుకు విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఓహెచ్‌ఈలో సప్లై ఆగిపోయినప్పుడు ఆటోమెటిక్‌గా డ్రైవర్ క్యాబిన్‌తోపాటు రైలు మొత్తం పవర్ ఆగిపోతుందన్నారు. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇంజిన్, కోచ్‌లలో విద్యుత్ సరఫరా అమరిక వేర్వేరుగా ఉంటుందన్నారు. దీంతో తాంబరం దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు ఈ రైళ్ల విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. 

Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన  

Also Read: Minister Senthil Balaji: తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం నుంచి సెంథిల్‌ బాలాజీ తొలగింపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News