India vs Pakistan Match: క్రికెట్ ప్రపంచంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ఆరోజు ఏ పనులన్నా సరే అవన్నీ మానేసి మ్యాచ్ ముందు వాలిపోతారు. ఇరుజట్లు ఆటగాళ్లు కూడా మైదానంలో అలానే తలపడతారు. ప్రపంచకప్ లో దాయాదుల పోరు వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఆడిన ప్రతిసారి విజయం టీమిండియానే వరించింది. 2023 వన్డే వరల్ కప్ కు భారత్ అతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబరు 15న భారత్, పాకిస్థాన్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. లక్ష మంది సీట్టింగ్ ఉన్న ఈ స్డేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మ్యాచ్ టికెట్ కు ఎంత డిమాండ్ ఉందో.. అదే రేంజ్ లో స్డేడియం బయట ఉన్న హోటల్ రూమ్స్ కు గిరాకీ ఉంది. అహ్మదాబాద్ లో అక్టోబర్ 15న హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఇరు దేశాల క్రికెట్ లవర్స్ కు తడిసి మోపుడవుతోంది. ఆరోజు హోటల్ గదుల అద్దె పది రెట్లు పెరిగనట్లు తెలుస్తోంది. కొన్ని హోటళ్లయితే రోజుకూ లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయని సమాచారం. మ్యాచ్ కు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే చాలా వరుకూ రూమ్స్ బుక్ అయినట్లు సమాచారం.
సాధారణంగా అహ్మాదాబాద్ లోని లగ్జరీ హోటళ్లలో ఒక రోజు ఉండటానికి రూ.5 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తారు. కానీ మ్యాచ్ రోజు మాత్రం రూ. 40 వేల నుంచి రూ. లక్ష వరకూ డిమాండ్ చేస్తున్నారు. booking.com వెబ్ సైట్ ప్రకారం, జులై 2న అక్కడి వెల్‌కమ్ హోటల్లో రూమ్ ధర రూ.5699, అదే అక్టోబర్ 15న అదే రూమ్ ధర రూ.71999 కావడం విశేషం. రెనైసాన్స్ అహ్మదాబాద్ హోటల్ రోజుకు రూ.8 వేలు ఛార్జ్ చేస్తుంది, కానీ మ్యాచ్ రోజు మాత్రం రూ.90679గా నిర్ణయించింది. మిగతా హోటల్స్ కూడా రేట్లను పెంచేశాయి. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చే ఎన్నారైలు, ధనవంతులు భారీ ధర చెల్లించి మరీ హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి