Netherlands Beat West Indies In Super Over: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ సంచలన విజయాలు నమోదవుతున్నాయి. ఉత్కంఠభరితో పోరులో వెస్టిండీస్‌ను నెదర్లాండ్స్ ఓడించింది. సూపర్ ఓవర్‌కు వెళ్లిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 374 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా.. నెదర్లాండ్స్ 6 బంతుల్లో 30 పరుగులు చేసింది. బదులుగా వెస్టిండీస్‌కు 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. సూపర్ ఓవర్‌లో ఆల్ రౌండర్ లోగాన్ వాన్ బీక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (76), జాన్సన్ చార్లెస్ (54) జట్టుకు గట్టి పునాది వేశారు. అనంతరం నికోలస్ పూరన్ సెంచరీతో చెలరేగాడు. 65 బంతుల్లోనే 104 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి విండీస్‌కు భారీ స్కోరు అందించాడు. షేయ్ హోప్ (47), కీమో పాల్ (46) మెరుపులు మెరిపించారు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 రన్స్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్ తలో రెండు వికెట్లు తీశారు.
375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్ జట్టు.. 30వ ఓవర్లో 170 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో తెలుగు కుర్రాడు తేజ నిడమనూరి జట్టును ఆదుకున్నాడు. దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను నెదర్లాండ్స్ వైపు మొగ్గేలా చేశాడు. 76 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్‌లు చేసి 111 పరుగులు చేశాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ (67)తో ఆరో వికెట్‌కు 143 రన్స్ జోడించి రేసులోకి తీసుకువచ్చాడు. తేజ ఏడో వికెట్ రూపంలో ఔట్ అయినా.. వ్యాన్ బీక్ (28), ఆర్యన్ దత్ (16) చివరి వరకు పోరాడారు. చివర్లో 4 బంతుల్లో 5 రన్స్ అవసరం అవ్వగా.. డచ్ జట్టు 4 పరుగులే చేసింది. చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో స్కోర్లు సమం అయ్యాయి.
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ ఆరంభించిన నెదర్లాండ్స్.. 30 పరుగులు చేసింది. జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్‌లో డచ్ బ్యాట్స్‌మెన్ వ్యాన్ బీక్ చెలరేగి ఆడాడు. వరుసగా ఆరు బంతుల్లో 4, 6, 4, 6, 6, 4 బాదడంతో 30 రన్స్ వచ్చాయి. అనంతరం వెస్టిండీస్ బ్యాటింగ్‌కు రాగా.. తొలి బంతినే చార్లెస్ సిక్స్‌గా ఊపుతీసుకువచ్చాడు. తరువాతి రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బాల్‌కు చార్లెస్, ఐదో బంతికి షెపర్డ్ ఔట్ అవ్వడంతో నెదర్లాండ్స్ గెలుపొందింది. సూపర్ ఓవర్‌లో 30 పరుగులు చేసిన వ్యాన్ బీక్.. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి డచ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఆల్‌రౌండర్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన వెస్టిండీస్.. ప్రపంచకప్‌కు క్వాలిఫై అవ్వడం సంక్షిషంగా మారింది. ఇప్పటికే జింబాబ్వే చేతిలో కరేబియన్ జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.
What it means ♥#WIvNED | #CWC23 pic.twitter.com/WZgktyLphX
— ICC (@ICC) June 26, 2023
Also Read: World Cup 2023 Schedule: వరల్డ్ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook