/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Telugu States Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో ఐదు రోజులకు రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో నార్త్ ఒడిశా-వెస్ట్ బెంగాల్ తీరాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.. ఆదివారం అల్పపీడనంగా మారింది. దీంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా తెలంగాణలో రానున్న ఐదు రోజులు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 

మరోవైపు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి నగరంలో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు చేరుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు వరద నీరు తొలగించేందుకు కృషి చేస్తున్నారు.

Also Read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ

సోమవారం ఉరుములు, మెరుపులతో  కూడిన  వర్షాలు  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ  వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు.

Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
heavy Rains in hyderabad imd issues yellow warning to telangana and rains to hit andhra pradesh due to low pressure
News Source: 
Home Title: 

Telugu Stated Weather Update: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్..  ఆంధ్రలో ఇది పరిస్థితి!

Telugu Stated Weather Update: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్..  ఆంధ్రలో ఇది పరిస్థితి!
Caption: 
Hyderabad Weather News (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్..  ఆంధ్రలో ఇది పరిస్థితి!
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Monday, June 26, 2023 - 07:51
Created By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
69
Is Breaking News: 
No
Word Count: 
225