Unbelievable Benefits of Drumsticks: సాధారణంగా మునగ లేదా మెురింగను 'సూపర్ ప్లాంట్'గా పిలుస్తారు. ఈ చెట్టు ద్వారా లభించే ప్రతిదీ తినదగినదే. ఈ మెుక్క ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. మీ మెుక్కను ఆయుర్వేదంలో ఉపయోగించే వారు. రెగ్యులర్ గా మనం మునగ కాడ కూరను తింటూ ఉంటాం. కానీ దీని కాడలే కాదు, ఆకులు, పువ్వులు, గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మునగకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలంటో తెలుసుకుందాం.
మునగ ప్రయోజనాలు
** మునగ కాయ డయాబెటిక్ రోగులకు వరమనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
** చర్మ వ్యాధులను పోగొట్టడంలో మెురింగా సూపర్ గా పనిచేస్తుంది. ఇందులో ఔషధ గుణాలు మెుటిమలను తొలగించడంతోపాటు చర్మానికి నిగారింపునిస్తుంది.
** మునగలో విటమిన్ ఏ, విటమిన్ బి, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జట్టును ఒత్తుగా చేయడంతోపాటు స్కిన్ ను కూడా కాపాడుతుంది.
** చికెన్ ఫాక్స్ ఉన్నవారు ముుగను తినడం మంచిది. ఎందుకంటే ఇది మీ రోగనిరోధక శక్తి పెంచి చికెన్ ఫాక్స్ కు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తుంది.
** ఎముకలను బలోపేతం చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మునగ కాయ అద్భుతంగా పనిచేస్తుంది.
** మునగ యాంటీఆక్సిడెంట్లు లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం ద్వారా మీ కంటి సమస్యలు దూరమవుతాయి.
** మునగ గింజలలో నియాజిమైసిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
** జీర్ణక్రియను మెరుగుపరచడంలో మునగ సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది.
Also Read: Best Veg Foods: ఈ కూరగాయల్ని రాత్రి పూట మార్చి మార్చి తింటే, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అన్నీ మాయం
** మునగకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇిది కొలెస్ట్రాలను అదుపు చేయడంలో సహాయకరిగా ఉంటుంది.
** బీపీని తగ్గించడంలో మునగకాయలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.
** రక్తాన్ని శుద్ధి చేయడంలో, వీర్యకణాలను ఉత్పత్తి చేయడంలో మునగకాయలు బాగా పనిచేస్తాయి.
** మునగకాయలలో ఐరన్ మరియు క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీంతో దంతాల గట్టిపడతాయి.
** మునగకాయలలో జింక్ మరియు సెలీనియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పునరుత్పత్తి వ్యవస్తను మెరుగుపరుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook