Heavy Rains in Hyderabad: ఎండల వేడిమి, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం ఒక్కసారిగా సేదతీరారు. ఇవాళ సాయంత్రం కురిసిన భారీవర్షంతో నగరం తడిసిముద్దయింది. ఎండలతో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం లభించింది.
ఏపీలో నిన్నటి నుంచి నైరుతి రుతుపవనాల విస్తరించడం ప్రారంభమైంది. ఆ ప్రభావంతో నిన్న ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలు సేదతీరారు. తెలంగాణలో రేపట్నించి రుతుపవనాలు బలపడి వర్షాలు ప్రారంభం కానున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈలోగానే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్మి భారీ వర్షం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, బోడుప్పల్, ఖైరతాబాద్, మణికొండ, గచ్చిబౌలి, లాలాపేట్, ఓయూ, తార్నాక, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి, నాంపల్లి, ఎల్బీనగర్, హయాత్ నగర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అటు కోఠి, ఆబిడ్స్, బేగంబజార్, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.
Also Read: Hyderabad: సాగర్ రింగ్ రోడ్‌లో కుప్పకూలిన ఫ్లై ఓవర్..
హైదరాబాద్‌లో సాయంత్రం వరకూ వేడిగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో ఇప్పటి వరకూ అధిక ఉష్ణోగ్రత, వేసవితాపంతో ఉన్న ప్రజానీకం ఊపిరిపీల్చుకున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.
వచ్చే మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కొనసాగుతాయి.
Also Read: Heavy Rains Alert: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, ఆ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rains in Hyderabad: రుతుపవనాలొచ్చేశాయోచ్.. వర్షాలతో పులకరించిన హైదరాబాద్.. సేద తీరిన జనం!