Cyclone Biparjoy Effect 2023: ఈ ఏడాది భానుడి ప్రకోపం ఇంకా చల్లారలేదు. చాలా రాష్ట్రాల్లో సూర్యతపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బిపార్‌జోయ్ తుఫాన్ రుతుపవనాలు చాలా ప్రాంతాలను ఇంకా తాకలేదు. దీంతో వర్షాల కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటు వర్షాలు లేక.. అటు ఎండలకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు తూర్పు భారతదేశాన్ని బిపార్‌జోయ్ తుఫాను ప్రభావంతో రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మండుతున్న వేడి నుంచి కొంత ఉపశమనం కలగనుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో సోమవారం తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వేడిగాలుల వ్యాప్తి ఈ వారంలో ముగిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. హీట్ వేవ్ కారణంగా బీహార్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్‌లో పాఠశాలలకు జూన్ 24వ తేదీ వరకు వేసవి సెలవులు పొడగించారు. అత్యధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ఏపీలోనూ ఈ నెల 24వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?
బిపార్‌జోయ్ తుఫాన్ ప్రస్తుతం దక్షిణ రాజస్థాన్ మధ్యలో కేంద్రీకృతమై ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో యూపీలో కూడా వర్షాలు పడతాయని చెప్పారు. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాజస్థాన్‌లోని బార్మర్, జలోర్, సిరోహి జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు.
సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 330 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 264 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. అల్లూరి 6, బాపట్ల 1, తూర్పు గోదావరి 8, ఏలూరు 7, కృష్ణా జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణ్రోగ్రత నమోదైందని తెలిపారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో 45.9, మన్యం జిల్లా సాలూరు, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 45.7, తూ.గో జిల్లా నందరాడలో 45.4, ప్రకాశం జిల్లా పట్చావలో 45.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాల్పులు వీయనున్నాయి.
Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook