Sun transit 2023: మరో 4 రోజుల్లో కీలక పరిణామం.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనం..

Sun transit 2023: మరో నాలుగు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2023, 11:10 AM IST
Sun transit 2023: మరో 4 రోజుల్లో కీలక పరిణామం.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనం..

Surya Gochar 2023: ఆత్మ, విజయం మరియు గౌరవానికి కారకుడిగా సూర్యభగవానుడిని భావిస్తారు. జూన్ 15న సూర్యభగవానుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు నాలుగు రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. దీంతో నెలరోజులపాటు ఆదిత్యుడు ఇదే రాశిలో ఉండనున్నాడు. అనంతరం జూలై 16న భానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి మిథునరాశి ప్రవేశం ఏయే రాశులవారికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం
మేషం: సూర్యుని సంచారం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ధైర్యసాహసాలు పెరుగుతాయి. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీ సహోద్యోగులతో మంచిగా వ్యవహరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
సింహ రాశి: సూర్య రాశి మార్పు సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు పాత సమస్యల నుండి బయటపడతారు. ఈ సమయంలో మీ ఒత్తిడి దూరమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ధనం రెట్టింపు అవుతుంది. 

Also Read: Shukra Gochar 2023: జూలై 07 వరకు కర్కాటక రాశిలోనే శుక్రుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

కన్య: సూర్యుని గోచారం కన్యారాశి వారికి లాభాలను ఇస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు కొత్త మిత్రులు ఏర్పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
కుంభం: ఆదిత్యుడి సంచారం వల్ల కుంభ రాశి వారు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. మీ డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులు లాభపడతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also Read: Guru Gochar 2023: ఏడాదిన్నరపాటు ఈ 3 రాశుల వారిపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News