AP EAMCET Result 2023 Date: ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలపైనే ప్రస్తుతం ఏపీ ఇంటర్ విద్యార్థుల ఫోకస్ నెలకొని ఉంది. ఎంసెట్ ఫలితాల ఆధారంగానే చాలామంది ఇంటర్ తరువాత తమ భవిష్యత్ ఏంటనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే తాము చదవాలనుకున్న చదువుని చదువుకునే అవకాశం వస్తుందా లేదా ? లేదంటే తాము అనుకున్న లక్ష్యాన్ని పక్కనపెట్టి, వచ్చిన ర్యాంకుతో రాజీపడి, మరొక కోర్సు తీసుకుని మరో మార్గం ఎంచుకోవాలా ? ఒకవేళ ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి, కోరుకున్న చదువు చదువుకునే అవకాశం వస్తే తమకు నచ్చిన విధంగా కోరుకున్న కాలేజీలో సీటు వస్తుందా ? రాదా ? అది కూడా తమకు నచ్చిన కోర్స్‌లో అడ్మిషన్ లభిస్తుందా లేదా ? ఇలా రకరకాల సందేహాలు ఇంటర్ విద్యార్థుల బుర్రను తొలిచేస్తుంటాయి. పిల్లల భవిష్యత్ కోసం ప్లాన్ చేసే తల్లిదండ్రుల్లోనూ ఈ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకే ఇప్పుడు ఏపీలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల దృష్టి అంతా ఏపీ ఇంటర్ ఫలితాలపైనే ఉంది.
ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. కే హెమచంద్రా రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 12.. లేదా ఆ తరువాతే జేఎన్టీయూ అనంతపురం యూనివర్శిటీ ఏపీ ఎంసెట్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Kakinada Accident : గుడిలోకి దూసుకెళ్లిన గ్రావెల్ లారీ.. ముగ్గురు దుర్మరణం..
ఏపీ ఎంసెట్ ఫలితాలు 2023 ఎలా చెక్ చేయాలంటే..
ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్- cets.apsche.ap.gov.in 2023 ని విజిట్ చేయండి.
ఓపీ ఎంసెట్ ఫలితాలు 2023 అనే లింకుపై క్లిక్ చేయండి.
ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఏపీ ఎంసెట్ 2023 ఫలితంని డౌన్‌లోడ్ చేసి, ఒక ప్రింటౌట్ తీసుకోని కౌన్సిలింగ్, అడ్మిషన్ వంటి భవిష్యత్ అవసరాల కోసం పదిలంగా సేవ్ చేసుకోండి.
ఇది కూడా చదవండి : Odisha Train Accident Updates: రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా.. ఏపీ వాసులను ఆదుకోవాలని ఆదేశం
ఇది కూడా చదవండి : Heat Wave alert: ఏపీ వాసులకు అలర్ట్.. ఇవాళ, రేపు కూడా మాడు పగిలేలా ఎండలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
AP EAMCET Result 2023 Date: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడంటే..