Weird Marriage Rituals: ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల ఆచార వ్యవహారాలున్నాయి. కొన్ని ఆచారాలు విచిత్రంగా ఉంటాయి. ఇంకొన్ని భయం గొలుపుతుంటాయి. మరికొన్ని విడ్డూరంగా ఉంటాయి. కొన్ని ఆచారాలు నైతికతనే ప్రశ్నిస్తుంటాయి. అలాంటి ఆచార వ్యవహారాలే ఇవి.
Weird Marriage Rituals: పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతులు ఉంటాయి. ఒక్కో మతంలో ఒక్కో రకంగా పెళ్లి జరిపించే విధానముంటుంది. సాంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పెళ్ళి జరగాలంటే ఇతరుల భార్యల్ని దొంగిలించాల్సిందే. ఇలా చేస్తే వారిపై ఏ విధమైన చర్యలుండవు. పైగా దొంగిలించి తీసుకొచ్చిన ఇతరుల భార్యతో పెళ్లి కూడా జరిగిపోతుంది.
అయితే ఆమె భర్తకు తెలియకుండా ఇదంతా చేయాలి. ఎవరైనా వివాహిత మహిళ మరో వ్యక్తి పట్ల ఆకర్షితురాలై ఇంట్లోంచి పారిపోతే అందరూ కలిసి వెతికి పెళ్లి చేసేస్తారు.
ప్రతియేటా ఈ తెగలో గేరేవోల్ వేడుక జరుగుతుంటుంది. ఈ వేడుకలో అబ్బాయిలు అలంకరించుకుని ముఖానికి రంగు రాసుకుంటారు. ఆ తరువాత వేడుకలో పాల్గొంటారు. ఇతరుల భార్యల ముందు డ్యాన్స్ చేస్తూ వారిని మెప్పించేందుకు ప్రయత్నిస్తారు.
ఇక్కడి ఆచారం ప్రకారం ఇంట్లో కుటుంబసభ్యుల అంగీకారంతో తొలి పెళ్లి జరుగుతుంది. రెండవ పెళ్లి మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఎవరైనా రెండవ పెళ్లి చేసుకోవాలంటే..ఆ వ్యక్తి మరో వ్యక్తి భార్యను దొంగిలించాలి. అలా చేయలేకపోతే పెళ్లి చేసుకోలేడు.
పశ్చిమ ఆఫ్రికాలోని వోదాబ్బో తెగలో ఉన్న ఆచారమిది. ఈ తరహా పెళ్లి ఇక్కడి ఆచార వ్యవహారాల్లో భాగం. ఇతరుల భార్యల్ని దొంగిలించి జీవిత భాగస్వామిగా చేసుకుంటారు.
ఇది మీకు నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ ముమ్మాటికీ నిజమిది. ఆఫ్రికాలోని ఓ తెగలో జరిగే ఆచారమిది. ఇక్కడ పెళ్లి కోసం ఇతరుల భార్యల్ని దొంగిలిస్తారు.