Heat Wave alert in AP: ఏపీలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత కారణంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాడు పగిలి పోతుంది. రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఇవాళ, రేపు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఆదివారం 135 మండలాల్లో, సోమవారం 276 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది.
భానుడు భగభగలకు శనివారం ప్రజలు అల్లాడిపోయారు. పల్నాడు జిల్లా రావిపాడులో 45.6, తూర్పు గోదావరి జిల్లా పెరవలి, బాపట్ల జిల్లా వేమూరు, గుంటూరు జిల్లా మంగళగిరి, మన్యం జిల్లా పెదమేరంగిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ పేర్కొన్నారు.
Also Read: Odisha Train Accident News: 316 మంది ఏపీ వాసులు సేఫ్.. ఆ 141 మంది కోసం సెర్చింగ్
ఉష్ణోగ్రతలు పెరగడంతో రోడ్లుపై వ్యాపారాలు చేసుకునేవారు, కూలీ పనులకు వెళ్లేవారు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు మరియు బొగ్గు గనుల్లో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బకు కొందరు ప్రాణాలు విడిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఏ పనులైనా ఉంటే ఉదయం, సాయంత్రం చూసుకుంటే మంచిది. ఈ వేడికి బాడీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా నీరు, మజ్జిగ, నిమ్మరసం, జ్యూస్ మరియు కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం మంచిది.
Also Read: AP Passengers: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణీకులపై కీలకమైన అప్డేట్, ఆ 141 మంది ఏమయ్యారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి