దేశవ్యాప్తంగా నేడు 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. స్వాతంత్ర్య వేడుకలకు దేశ ప్రజలు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగింస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం 'ఆయుష్మాన్ భారత్' ను ప్రధాని మోదీ నేడు కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఎర్రకోట వద్ద చేసే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ పథకంపై మోదీ కీలక ప్రకటన చేయనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
PM Narendra Modi unfurls the tricolour at Red Fort. #IndiaIndependenceDay pic.twitter.com/sTogztX64z
— ANI (@ANI) August 15, 2018
WATCH live via ANI FB: PM Narendra Modi addresses the nation from the Red Fort in Delhi #IndependenceDayIndia https://t.co/s6NjZ0Ry3Q pic.twitter.com/MGTXUyFWAB
— ANI (@ANI) August 15, 2018
‘ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ గురించి ప్రసంగిస్తారు. ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశాలున్నాయి’ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఈ పథకంలో చేరేందుకు ఇప్పటికే ఒడిశా విముఖత చూపగా.. పంజాబ్, కేరళ, మాహారాష్ట్ర, కర్ణాటక ఏ నిర్ణయం ప్రకటించలేదని కేంద్ర అధికారులు తెలిపారు.
ఎర్రకోట నుంచి ప్రధాని చేయనున్న ప్రసంగాన్ని గూగుల్, యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ప్రధాని ప్రసంగం ఆకాశవాణిలో 20 వేర్వేరు భాషల్లో కూడా ప్రసారమవుతుంది.
అటు దేశ రాజధాని ఢిల్లీలో 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ వందల సీసీటీవీ కెమెరాలు, ఎన్‌ఎస్‌జీ బలగాలు, స్వాట్ కమాండోలతో పాటు సుమారు 10 వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు.