Malli Pelli Collection : ఈ వీకెండ్ బాక్సాఫీస్ లెక్కలివే.. తుస్సుమన్న నరేష్‌ పవిత్ర జిమ్మిక్కులు

Weekend Movie Collections ఈ వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద మాలీవుడ్ సినిమా దుమ్ములేపేసింది. తెలుగులో నేరుగా వచ్చిన మేమ్ ఫేమస్, మళ్లీ పెళ్లి సినిమాలు తేలిపోయాయి. కానీ మేమ్ ఫేమస్ సినిమాకు ఇంకా ప్రమోషన్స్ చేస్తూ హిట్ అనిపించేలా కలరింగ్ ఇప్పిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2023, 08:45 PM IST
  • వీకెండ్‌లో బాక్సాఫీస్‌ కళకళ
  • మెప్పించిన డబ్బింగ్ సినిమా
  • తేలిపోయిన పవిత్ర నరేష్‌ స్టంట్లు
Malli Pelli Collection : ఈ వీకెండ్ బాక్సాఫీస్ లెక్కలివే.. తుస్సుమన్న నరేష్‌ పవిత్ర జిమ్మిక్కులు

Pavithra Naresh Malli Pelli ఈ వారం శుక్రవారం రోజున పలు ఆసక్తికరమైన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా వాటిలో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన సినిమాలు మూడే ఉన్నాయి. ఆ మూడులో ఒకటి మలయాళ డబ్బింగ్ 2018 మూవీ. కాగా మరొకటి యూత్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న మేం ఫేమస్ సినిమా. మరొక సినిమా విషయానికి వస్తే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా.

2018 సినిమాని మలయాళంలో కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఆ సినిమాని మలయాళ ప్రేక్షకులందరూ విపరీతంగా ఓన్ చేసుకున్న నేపథ్యంలో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి కేరళలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేశారు. గీత ఆర్ట్స్ ప్రమేయం లేకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఈ సినిమా రిలీజ్ చేయగా ఆయనకు మంచి జాబ్ పాట అయితే లభించింది. ఈ సినిమా మొదటి వీకెండ్ లో నాలుగున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

కేవలం మూడే రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేయడం గమనార్హం. ఇక మొత్తం కొత్త వారే కలిసి నటించిన మేం ఫేమస్ సినిమా కూడా ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే సుమంత్ ప్రభాస్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేశాడు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థ తక్కువ ఖర్చులోనే నిర్మించిన ఈ సినిమా కూడా దాదాపు మూడున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి హిట్గా నిలిచింది.

Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

ఇక మరో పక్క నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా కాంట్రవర్సీల విషయంలో ముందు ఉన్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం జోరు చూపించడం లేదు. ఆ సినిమా మొదటి వీకెండ్ లో కేవలం జీరో షేర్ రాబట్టడం గమనార్హం.

Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News