Men Too Review: మెన్ టూ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Men Too Telugu Movie Review : టీజర్, ట్రైలర్లతో యూత్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తాజా చిత్రం మెన్ టూ మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2023, 09:22 PM IST
Men Too Review: మెన్ టూ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Men Too Movie Review : ఈ మధ్యకాలంలో యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు ఎక్కువగా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా టీజర్, ట్రైలర్లతో యూత్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తాజా చిత్రం మెన్ టూ. నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్దవరం, వైవాహర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజీ, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేశారు ఈ సినిమాలో హీరోగా నటించిన మౌర్య సిద్దవరం సినిమాని నిర్మించడం గమనార్హం. ఈ సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

మెన్ టూ కథ విషయానికొస్తే 
ఒక నలుగురు యువకులు రెగ్యులర్గా పబ్లో కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు కష్టనష్టాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్న(మౌర్య సిద్దవరం) రాహుల్(వైవా హర్ష), రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయి అక్కడి పబ్                                                                                      సిబ్బందితో కలిసిమెలిసి ఉంటారు. పబ్ ఓనర్(బ్రహ్మాజీ) అందులో పని చేసే వెయిటర్ సుదర్శన్ కూడా వారి సాధకబాదకాలన్నీ వింటూ వారితో కలిసి పోతూ ఉంటారు. ఈ నలుగురిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, తమ బాధలన్నీ షేర్ చేసుకుని చివరికి ఒక్కొక్కరి బాధను ఎలా క్లియర్ చేసుకున్నారనేది సినిమా కధ.

విశ్లేషణ
యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలకి ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు అందరూ ఇలాంటి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలుస్తున్న నేపథ్యంలో అలాంటి సినిమాతోనే మెన్ టూ యూనిట్ కూడా ముందుకు వచ్చింది. యూత్ కి కనెక్ట్ అయ్యేలా కామెడీ చేస్తూనే మెసేజ్ ఇస్తే ఆదరిస్తున్నారని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. మెన్ టూ కూడా దాదాపుగా అలాంటి సినిమాని కేవలం అమ్మాయిలు మాత్రమే హెరాస్మెంట్ ఎదుర్కోవడం లేదు అబ్బాయిలు కూడా హెరాస్మెంట్ కి గురవుతున్నారు అని చెప్పుకునే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనునిత్యం మనం చుట్టూ చూసే యూత్ లో జరిగే అనేక అంశాలు చూపించారు. ఒకపక్క మెసేజ్ ఇస్తూనే మరోపక్క యూత్ ని ఎంటర్టైన్ చేసే విధంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించారు.

కథా కథనాలు ఎక్కడ బోర్ కొట్టించకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనను ఒకపక్క కామెడీగా చూపిస్తూనే మరోపక్క ఎమోషనల్ అయ్యేలా ఆవిష్కరించాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ లో రాహుల్ కథతో ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా నడిపించి ఆడియన్స్ ని అన్ని ట్రాక్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశాడు. వర్క్ ప్లేస్ లో అమ్మాయిలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మల్టీ నేషనల్ కంపెనీలు అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని వారి అభిప్రాయాలు కూడా గౌరవించాలని ఒక పాత్రతో చెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాల ఇబ్బందులు అన్ని చోట్ల ఎదుర్కొంటూ ఉంటారని ఈ సినిమా ద్వారా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే 
నరేష్ అగస్త్య పాత్ర చాలామంది యూత్ ని కనెక్ట్ అవుతూ మెసేజ్ కూడా ఇస్తుంది. కౌశిక్ కూడా కాస్త యాంగ్రీ గా కనిపించి ప్రేక్షకులందరినీ మెప్పించాడు. గీతా పాత్రలో రియా సుమన్ గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. ఇక భార్యా బాధితుల పాత్రలో బ్రహ్మాజీ అత్యంత నవ్వించాడు. బార్ లో పనిచేసే వెయిటర్ పాత్రలో సుదర్శన్ అయితే జీవించేశాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నాయి.

టెక్నికల్ టీం

ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు రాసుకున్న కథాకథనాలు ఆసక్తికరంగా గ్రిప్పింగ్ గా అనిపించాయి. కొంచెం లాగ్ అనిపించినా సరే సీన్స్ చాలా వరకు ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు  అయితే ఎడిటింగ్ మీద కొంత కేర్ తీసుకుని ఉంటే మరింత బాగుండేది. సాంగ్స్ అయితే పెద్దగా క్యాచీగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

రేటింగ్: 2.75/5
 

 

Trending News