Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?

Mem Famous Movie Review:  సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ దర్శకుడిగా హీరోగా వ్యవహరిస్తూ మేం ఫేమస్ సినిమాని తెరకెక్కించారు. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

Written by - Chaganti Bhargav | Last Updated : May 26, 2023, 01:43 PM IST
Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?

Mem Famous Movie Review: మేజర్, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలను నిర్మించి వరుస సక్సెస్ లు అందుకున్న తర్వాత చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ మేం ఫేమస్ సినిమాని నిర్మించింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ దర్శకుడిగా హీరోగా వ్యవహరిస్తూ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేయడంతో యూత్లో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. దానికి తోడు సినిమాకి ఒక్కరోజు ముందు మహేష్ బాబు సినిమా బాగుందని ట్వీట్ చేయడమే కాదు రెండో సినిమా అవకాశం కూడా ఆ దర్శకుడు ఇస్తున్నారంటూ ప్రకటించడంతో సినిమా మీద మరింత ఆసక్తి ఏర్పడింది. మరి అలాంటి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

మేం ఫేమస్ కథ విషయానికి వస్తే
తెలంగాణలోని ఒక గ్రామానికి చెందిన మై అలియాస్ మహేష్(సుమంత్ ప్రభాస్) దుర్గా(మణి), బాలి అలియాస్ బాలకృష్ణ(మౌర్య చౌదరి) ముగ్గురు చిన్ననాటి నుంచి స్నేహితులు. చదువు పూర్తయిన ఎలాంటి పని చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే పనులకు ఊరిలో జనాలు ఇబ్బంది పడుతూ పంచాయతీలు పెడుతూ ఉంటారు.

ఊరందరూ వారిని సపోర్ట్ చేయకపోయినా ఆ ఊరి ప్రెసిడెంట్ జింక వేణు(కిరణ్ మచ్చ) అంజి మామ(మై విలేజ్ షో) అంజి మాత్రం మద్దతు ఇస్తూ ఉంటారు. ఒకానొక పరిస్థితిలో చావోరేవో అన్నట్టు ఏర్పడిన క్రమంలో వాళ్లు ఫేమస్ అయ్యి ఊరికి మంచి పేరు తేవాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. అలాంటి సమయంలో వారు ఎలాంటి పని చేసి ఫేమస్ అయ్యారు? ఈ మధ్యలో వారి టెంట్ హౌస్ బిజినెస్ ఏమైంది? యూట్యూబ్ ఛానల్ వ్యవహారం ఏమిటి? హీరో అతని ఫ్రెండ్స్ చేసిన పనుల వల్ల ఊరికి మంచి పేరు వచ్చిందా? ఊరి సమస్యలు తీరాయా అనేది? ఈ సినిమా కథ. 

విశ్లేషణ
ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలామంది గతంలో విడుదల సూపర్ హిట్ గా నిలిచిన జాతి రత్నాలు సినిమాతో పోలి ఉందని ఫిక్స్ అయిపోయారు. దానికి ముఖ్యమైన కారణం రెండు సినిమాలు తెలంగాణ నేపథ్యంలోనే సాగుతూ ఉండగా రెండు సినిమాల్లోనూ ముగ్గురేసి స్నేహితులు తిరుగుతూ ఉండటం. అయితే జాతి రత్నాలు సినిమాలో ఏదైతే కామెడీ వర్కౌట్ అయిందో ఆ కామెడీ ఈ సినిమాలో మాత్రం పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. అయితే జాతి రత్నాలు సినిమా వయసుతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయితే ఈ మేం ఫేమస్ సినిమా మాత్రం కేవలం యూత్ ని మాత్రమే టార్గెట్ చేసి చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి విషయాలు చాలా మంది ఇతర వయసుల వారికి తెలియదు అలాంటివి వారికి కనెక్ట్ అవ్వడం కష్టమే. అయితే సినిమాని అటు ఎమోషనల్ గా నడిపిస్తూనే కామెడీతో వర్కౌట్ చేయించాలని కొత్త దర్శకుడు సుమంత్ ప్రభాస్ ప్రయత్నించాడు. కానీ అది పూర్తిస్థాయిలో సఫలం అవ్వలేదు.

Also Read: 2018 Telugu Review: మలయాళంలో కోట్లు కొల్లగొట్టిన '2018' రివ్యూ -రేటింగ్.. ఎలా ఉందంటే?

ఇక ఫేమస్ అయ్యేందుకు వారు చేసిన యూట్యూబ్ వీడియోలు కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాయి. నిజానికి ఈ సినిమాలో కనిపించే వారంతా దాదాపుగా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి వచ్చిన వారే. వారిలో ఏదైనా నిజ జీవిత సంఘటనలు తీసుకుని చేసి ఉంటె బాగుండేదేమో. కానీ ఏదో సృష్టించాలని ఇంకేదో సృష్టించినట్లు అనిపిస్తుంది. ప్రమోషన్స్ హైలో చేయడంతో ఆ రేంజ్ లో ఉంటుందని సినిమా థియేటర్ కు వెళ్ళిన వారికి నిరాశ ఎదురవక తప్పదు అయితే అలా అని తీసిపారేదగ్గ సినిమా కూడా కాదు. యూత్ ని మాత్రమే అట్రాక్ట్ చేసి వారికి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా మేకర్స్ ప్రమోషనల్ స్టెంట్స్ తో ఖచ్చితంగా సినిమా నచ్చి తీరాల్సిందే అన్నట్లుగా ప్రజల్లోకి ఒక వేవ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా రైటర్ పద్మభూషణ్ కి కూడా ఇదే కనిపించింది. ఇప్పుడు కూడా సినిమా నచ్చలేదంటే సినిమా జడ్జ్ చేయడం రాదేమో అని అనుమానాలు కలిగించే విధంగా చాలామంది చేత ప్రమోషన్స్ చేయించారు. ఏకంగా మహేష్ బాబు చేత కూడా ట్వీట్ చేయించారు. ఇది కొంత రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే 
హీరోగా సుమంత్ ప్రభాస్ బాగా చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఇక హీరో స్నేహితులుగా మణి, మౌర్య ఎక్కడ నటించిన ఫీల్ రాకుండా జీవించినట్లుగా అనిపించింది. ఇక సార్య కమర్షియల్ హీరోయిన్ అని కాకుండా పల్లెటూరిలో మనకు ఒక మరదలు ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన సిరి రాశికి హీరోయిన్ కంటే కాస్త నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక అంజి మామ, కిరణ్ మచ్చ, డీజే టిల్లు మురళీధర్ గౌడ్ వంటి వారు తమ పాత్రల పరిధి మేర నటించి న్యాయం చేశారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లిప్స్టిక్ స్పాయిలర్ లింగం పాత్రలో నటించిన బుడతడు కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. ఫ్యూచర్లో అనేక సినిమాల్లో కనిపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అయితే పాటలు మాత్రం గుర్తుంచుకోదగ్గవి లేవు. టైటిల్ సాంగ్ పర్వాలేదనిపించింది కానీ మిగతావన్నీ ఏ మాత్రం గుర్తుండే అవకాశం లేదు. ఇక కెమెరా వర్క్ సెటిల్డ్ గా ఉంది. కానీ కొన్ని ఫ్రేమ్స్ లో మాత్రం క్వాలిటీ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. ఎడిటింగ్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అయితే నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నా మరి కొంత బడ్జెట్ పెట్టి ఉంటే అవుట్ ఫుట్ వేరేగా వచ్చి ఉండేదేమో ఇక తెలంగాణ యాసలోని పంచ్ డైలాగులు ఆకట్టుకుంటాయి. సక్సెస్ఫుల్ సినిమాలను ఫాలో అవ్వాలని చేసిన ప్రయత్నంలా  అనిపిస్తుంది కానీ కొంత కొత్తగా ట్రై చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయ్యి ఉండేది.

ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
మేము ఫేమస్ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. యూత్ కి మాత్రమే!

Also Read: Dimple Hayathi: డింపుల్ హయాతికి ప్రాణి హాని.. బయటకు రావాలన్నా భయపడి పోతున్న హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News