Shani Jayanti Date 2023: ప్రతి సంవత్సరం శని జయంతిని జరుపుకుంటారు. ఈ రోజునే శని దేవుడు జన్మించాడు.. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే తిథి, ఈ నక్షత్రంలోనే శని జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు శని దేవుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నల్ల పెసలు దానం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు నల్ల పెసలు దానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దురదృష్టం తొలగిపోతుందా?:
ప్రస్తుతం చాలా మంది శని సాడే సాతి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు శని జయంతి రోజు నల్ల పెసలను దానం చేయాలి. ఇలా 21 శని వారాలు ఈ దానం చేయడం వల్ల జీవితంలో సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఈ ఉపాయంలో పాటు ఉసిరి చెట్టు కింద 21 శనివారాలు దీపం వెలిగించి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ఆర్థిక సమస్యలకు చెక్:
శని సాడే సాతి సమస్యలతో బాధపడుతున్నవారిలో ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రవహించే నదిలో నువ్వులతో పాటు నల్ల పెసలను వదలాల్సి ఉంటుంది. ఇలా ప్రతి శనివారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు సులభంగా దూరమవుతాయి.
శని గ్రహదోషంతో బాధపడుతున్నారా?:
మీ జాతకంలో శనిదోషం సమస్యలు ఉంటే తప్పకుండా ఈ రోజు శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శని దేవుడికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చయడం వల్ల త్వరలోనే మంచి ఫలితం పొందుతారు.
కోర్టు కేసులు:
మీరు ఎటువంటి కారణం లేకుండా చాలా కాలం పాటు కోర్టు కేసులో ఇరుక్కుని ఉన్నవారు ఈ రోజు శని దేవుడినికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజుకు మర్రి చెట్టుకు పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి