Summer Big Alert 2023: ఏపీలో గత 4-5 రోజులుగా వాతావరణం వేడెక్కిపోతోంది. వేసవి పీక్స్ చేరుతోంది. ఓ వైపు ఎండల తీవ్రత మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇది చాలదన్నట్టు రానున్న మూడ్రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజకూ పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గత 4-5 రోజులుగా అధకమౌతున్నాయి. ఇంకా రోహిణి కార్తె ప్రారంభమే కాలేదు. మే 25న ప్రారంభమై జూన్ 8 వరకూ రోహిణి కార్తె ఉంటుంది. సాధారణంగా రోహిణి కార్తె సమయంలో ఎండలు తీవ్రస్థాయిలో ఉండి ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతాయి. కానీ ఈసారి రోహిణి కార్తెకు పదిరోజుల ముందే ఎండలు బేజారెత్తిస్తున్నాయి. ఎండలకు తోడుగా తీవ్రమైన ఉక్కపోతతో జనం విసిగిపోతున్నారు. బయటకు రావాలన్నా, ఇంట్లో ఉండాలన్నా ఇబ్బందిగానే ఉంటోంది.
ఇప్పటికే ఉన్న పరిస్థితికి తోడు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వరుసగా మూడ్రోజులపాటు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని 136 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఇక ఎల్లుండి అంటే మే 16వ తేదీ మంగళవారం నాడు 153 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 132 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయి. ఎండల తీవ్రత నేపధ్యంలో ఆయా జిల్లాల యంత్రాగానికి ఇప్పటికే అప్రమత్తత జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 అందుబాటులో ఉంటాయి.
మే 14 ఆదివారం అంటే ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 45-47 డిగ్రీల మధ్య నమోదు కావచ్చు. ఇక శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాలు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42-44 డిగ్రీల వరకూ నమోదు కావచ్చు.
మే 15 సోమవారం రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుందని తెలుస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చు.
ఇక ఎల్లుండి అంటే మే 16 మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో 45-48 డిగ్రీలు నమోదు కావచ్చని సమాచారం. ఇక విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తాగడం, వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, బొప్పాయి కీరా వంటివి ఎక్కువగా తినాలి. దాంతోపాటు నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరి నీరు తరచూ తీసుకోవాలి.
Also read: Pawan Kalyan comments on AP CM post: ఏపీ సీఎం పోస్టుపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook