Lucknow: ఈ-రిక్షా బ్యాటర్ పేలి.. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి..

UP news: యూపీలోని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా బ్యాటర్ ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలడంతో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 13, 2023, 09:37 AM IST
Lucknow: ఈ-రిక్షా బ్యాటర్ పేలి.. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి..

E-Rickshaw Battery Explodes in Lucknow: ఈ-రిక్షా బ్యాటర్ పేలి ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మరణించిన ఘటన యూపీలోని లక్నోలో జరిగింది. ఈ పేలుడులో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. రిక్షా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుండగా ఈ బ్లాస్ట్ చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  

వివరాల్లోకి వెళితే...
బారాబంకీ బీబీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాజ్‌పూర్వా ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అంకిత్ కుమార్ గోస్వామి అనే వ్యక్తి కుటుంబం నివసిస్తుంది. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంకిత్ ఈ రిక్షా నడిపి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే రిక్షా నడిపి గురువారం రాత్రి ఇంటికి వచ్చిన అంకిత్ ఈరిక్షాకు ఛార్జింగ్ పెట్టి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో అతడి భార్య రోలి, కుమార్తె సియా, కుమారులు కుంజ్, చోటుతోపాటు మేనకోడలు రియా నిద్రిస్తున్నారు. 

గురువారం తెల్లవారుజాము సమయంలో బ్యాటర్ పేలడంతో ఇంట్లో ఉన్న భార్య, కుమారుడు కుంజ్, మేనకొడలు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన మరో ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అంకిత్ కుమార్తె మరియు ఏడవ నెలల కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను శుక్రవారం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Who will be Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో ఐదుగురు మాస్ లీడర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News